శ్రీదేవి ఈ లోకాన్ని, తన అభిమానులను విడిచి వెళ్లి సంవత్సరం అయిపోయిన ఆ విషయాన్ని ఇంకా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మంగళవారం ఈ ‘లెజెండరీ స్టార్’ జయంతి సందర్భంగా మరోసారి ఆమెను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పబ్లిషర్స్ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా శ్రీదేవి జీవిత చరిత్రను ఆమె భర్త బోనికపూర్ అనుమతితో పుస్తక రూపంలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.
‘శ్రీదేవి : గర్ల్ ఉమెన్ సూపర్ స్టార్’ పేరుతో తయారవుతున్న ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత సత్యార్థ నాయక్ రాస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘ఓ అభిమానిగా నేను ఎప్పుడు శ్రీదేవిని ఆరాధించేవాడిని. ఈ రోజు నాకు భారతీచయులకు ఎంతో నచ్చిన ఓ సూపర్ స్టార్ కథను చెప్పే అవకాశం దక్కింది.ఎన్నో ఏళ్లోగా శ్రీదేవితో కలిసి పనిచేసిన తారలు కలుసుకోవటం ఆనందంగా ఉంది. అవన్ని కలిపి ఓ చిన్నారి భారత తొలి లేడీ సూపర్ స్టార్ ప్రయాణంగా పుస్తకరూపంలో తీసుకురావటం ఓ గొప్ప అనుభూతి’ అన్నారు. ఈ పుస్తకాన్ని ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీదేవి కలను నెరవేర్చాను !
తమిళ స్టార్ హీరో అజిత్ ఇదే ఏడాది మరో చిత్రంతో అజిత్.. తన ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడు. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన.. ‘పింక్’ చిత్రాన్ని తమిళ్‌లో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత బోనీ కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు.
‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సమయంలోనే.. అజిత్‌తో ఓ చిత్రాన్ని నిర్మించాలని శ్రీదేవి భావించడం.. ఆమె కోరిక మేరకే ఈ రీమేక్‌లో నటించేందుకు అజిత్ ఒప్పుకోవడం అందరికీ తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా విడుదలకు సిద్దం కావడం.. ఈ సందర్భంగా నిర్మాత బోనీ కపూర్ స్పందిస్తూ.. “శ్రీదేవి కలను నెరవేర్చాను అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. శ్రీదేవి కల నెరవేర్చాను. అజిత్, దర్శకుడు వినోద్, ఇతర సాంకేతిక నిపుణులు లేకుంటే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. దీన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను” అంటూ ట్వీట్ చేశారు.