‘స్టార్‌డమ్‌’ జీవితం గురించి తెలుసుకునే అవకాశం ఇవ్వలేదు !

శ్రీదేవి  మీడియాతో అప్పుడప్పుడు  మాట్లాడినప్పుడు చెప్పిన విషయాలు …..

► ‘రియల్‌ శ్రీదేవి’ ఎలా ఉంటారు?
నేను అందరిలానే సాధారణ మనిషిని. నేనంత ఆసక్తికరం కూడా కాదు. ఇంకో తల్లిదండ్రుల బిడ్డను. ‘రియల్‌ శ్రీదేవి’ అంటే ఏంటో తెలియాలంటే నా ఇంటికి వచ్చి నన్ను చూడాలి. నాకు చాలా సిగ్గు. అంత త్వరగా ఎవరితోనూ కలవలేను. మాట్లాడలేను. కొత్త వాళ్లతో మాట్లాడాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. సినిమాల్లో మాట్లాడేలా గలగలా మాట్లాడలేను. చాలా తక్కువగా మాట్లాడతా.

► ‘స్టార్‌డమ్‌’కి చేరుకున్నాక మీ ఫీలింగ్‌?
చిన్నప్పటి నుంచి ‘నాకేదైనా ఇష్టం’ అంటే అది నా దగ్గరకు వచ్చేసేది. ఫర్‌ ఎగ్జాంపుల్‌ నాకేదైనా చీర నచ్చితే …దానికోసం నేను షాప్‌కి వెళ్లక్కర్లేదు. అదే నా దగ్గరకు వచ్చేది. కోరుకున్నది మన దగ్గరికే వచ్చినప్పుడు జీవితం గురించి తెలుసుకునే చాన్స్‌ ఉండదు. ఆ విధంగా ‘స్టార్‌డమ్‌’ నాకు జీవితం గురించి తెలుసుకునే అవకాశం ఇవ్వలేదు.

► నటిగా మీకు నచ్చని విషయం ఏంటి?
మీరు ఫలానా సినిమాలో అందంగా ఉన్నారని అభినందిస్తే నాకు నచ్చదు. ఆ కాంప్లిమెంట్‌కి రియాక్ట్‌ అవ్వను. అదే ‘మీరు ఆ సినిమాలో చాలా బాగా యాక్ట్‌ చేశారు’ అంటే అప్పుడు చాలా ఆనందపడతా. గర్వంగా ఫీల్‌ అవుతాను.

► మీలా అందంగా, స్లిమ్‌గా కనిపించాలంటే ఏం చేయాలి?
అందంగా ఉండటమంటే డైట్‌ ఫాలో అవ్వడం, జిమ్‌కు వెళ్లడం కాదు. మానసికంగా సంతోషంగా ఉండటం. మన స్టేట్‌ ఆఫ్‌ మైండ్‌ ఎలా ఉందనేది మన లుక్స్‌ నిర్దేశిస్తాయి. లోపల సంతోషంగా లేనప్పుడు డైట్‌ ఫాలో అయ్యి, ఎంత జిమ్‌ చేసినా ఉపయోగం ఉండదు.

► వేరే హీరోయిన్స్‌తో పోటీ?
పోటీ అనేది సమఉజ్జీల మధ్య ఉంటుంది. ప్రస్తుతానికి నా సమఉజ్జీ శ్రీదేవీయే. నాకు నేనే పోటీ.

► మీ సినిమాల గురించి జాన్వీ, ఖుషీలు ఏమంటారు?
నేను నటించిన పాత సినిమాలను జాన్వీ, ఖుషీ అంతగా చూడలేదు. కానీ ఎప్పుడైనా టీవీల్లో వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా చూస్తారు. ఆ సినిమాల్లో నేను వేసుకున్న డ్రెస్‌లను అబ్జర్వ్‌ చేస్తారు. నేను కొన్ని సినిమాలకు ట్రెండీ డ్రెస్‌లను వాడాను. అవి బాగున్నాయంటారు. బాగా యాక్ట్‌ చేశావని కాంప్లిమెంట్స్‌ ఇస్తారు.

► సినిమాలంటే మీకు చాలా ఇష్టమా?
నాలుగేళ్ల వయసు నుంచే నటించడం స్టార్ట్‌ చేశాను. అందరి అమ్మాయిల్లా నేను పెరగలేదు. నా చిన్నతనంలో స్టూడియోస్‌లోనే ఎక్కువ టైమ్‌ గడిపేదాన్ని. ఒకవేళ స్టూడియో వాతావరణాన్ని ఇష్టపడకపోయి ఉంటే.. ఎప్పుడో సినిమాలు వదిలేసేదాన్నేమో. ఒక సినిమా చేయాల్సి వచ్చినప్పుడు ఎంత కష్టాన్నయినా ఇష్టంగా భావిస్తాను.

► మీ భర్త బోనీకపూర్‌ మిమ్మల్ని ఆటపట్టిస్తారా?
నేను క్రమశిక్షణతో ఉంటాను. బోనీజీ ‘నువ్వేమైనా సాధువులా జీవిస్తున్నావా?’ అని ఆటపట్టిస్తారు. కానీ నా ఇష్టాలను ఆయన ఎప్పుడూ కాదనలేదు.

► యంగర్‌ జనరేషన్‌కి మీరిచ్చే సలహా?
సక్సెస్‌నే కాదు ఫెయిల్యూర్‌నూ తట్టుకోగల మైండ్‌సెట్‌ను ఇంప్రూవ్‌ చేసుకోవాలి. లైఫ్‌లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే కృతజ్ఞతాభావం, మానవత్వం ఉండాలి.

► మీరు స్వతహాగా మితభాషి కదా. ఇంట్లో కూడా అంతేనా?
నేను తక్కువగానే మాట్లాడతాను. కానీ నాకు క్లోజ్‌గా ఉన్నవారితో బాగానే మాట్లాడతా. వర్క్‌ చేసే దగ్గర వర్క్‌ గురించే మాట్లాడటం ముఖ్యమని భావిస్తా. చెబితే నమ్మరు కానీ, కాస్త ఎక్కువగా మాట్లాడమని బోనీజీ మొదట్లో బతిమాలేవారు. ఆ తర్వాత మాత్రం సీన్‌ రివర్స్‌ అయ్యింది. మేం ఇద్దరం ఉన్నప్పుడు నేనే ఎక్కువగా మాట్లాడతా.

► మీరు, మీ పిల్లలు అక్కచెల్లెళ్లలా ఉంటారు…
మేం సిస్టర్స్‌లానే బిహేవ్‌ చేస్తాం. నేనెక్కడికైనా వెళితే చాలు జాన్వీ పదే పదే ఫోన్లు చేస్తుంటుంది. ఖుషీ కూడా అంతే. నన్ను వదిలి ఉండలేరు. వాళ్లు నాతో అలా క్లోజ్‌గా ఉండటం, నా మీద ఆధారపడటం, చిన్న చిన్న విషయాల్లో నన్ను డిస్ట్రబ్‌ చేయడం నాకెంతో ఫన్నీగా, హ్యాపీగా ఉంటుంది.

► జాన్వీ సినిమాలో నటిస్తోంది కదా.. తనకు మీరిచ్చిన సలహా?
మైండ్‌తో కాదు… హార్ట్‌తో వర్క్‌ చేయమని జాన్వీకి చెప్పాను.
‘నో పెయిన్‌ నో గెయిన్‌’ అని కూడా చెప్పాను.

మీరు బాధపడే విషయం               :    మరణం తర్వాత జీవితం ఉండదని
మీ విలువైన ఆస్తి                        :    నా ఫ్యామిలీ
మీకు బోర్‌ కొట్టించేది                    :    షూటింగ్‌లో ఏదైనా జరిగినప్పుడు హాస్పిటల్‌కు పరిగెత్తడం
మీ సెక్స్‌ అపీల్‌                           :    నా జీన్స్‌ (జన్యువులు)
మీ బలం                                   :    ఏది జరిగితే దాన్ని ఆమోదించడం
మీకు నచ్చే మీ ఫేవరెట్‌ క్వాలిటీ      :    నా ఎమోషన్స్‌
మిమ్మల్ని చిరాకు పెట్టించేది          :    రీ–మేక్‌ మూవీస్‌లో రీ–టేక్స్‌ తీసుకోవడం
బర్త్‌డే అంటే                               :   ఎడ్జ్‌కు ఇంకొంచెం దగ్గరకి వచ్చేశాం అని గుర్తు చేసే రోజు

 

శ్రీదేవికి కుమార్తె జాన్వీ ఓపెన్‌ లెటర్‌

ఓ సందర్భంలో శ్రీదేవికి ఓపెన్‌ లెటర్‌ రాయమని ఓ పత్రిక ఆమె పెద్ద కుమార్తె జాన్వీని కోరగా ఆమె ఈ విధంగా రాశారట.దీన్నిచదివితే తల్లంటే జాన్వీకి ఎంత ప్రేమ, గౌరవం ఉన్నాయో అర్థమవుతుంది….

డియర్‌ మామ్‌…

నీ కీర్తి ప్రతిష్టలు, అంకితభావం, నిజాయితీ, స్ఫూర్తి గురించి వింటూ పెరుగుతున్నాను. నువ్వు సాధించిన విజయాలకు నేనే సాక్ష్యంగా ఉండటం నాకు ఆనందంగా ఉంది. జీవితంలో అన్నీ సాధించావు. నువ్వు సాధించిన ఈ ఘనత నన్ను ఈ ప్రపంచంలోనే గర్వపడే కూతుర్ని చేసింది. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను…
                                                                                                 – నీ కూతురు జాన్వీ    

 

బాలీవుడ్‌లో శ్రీదేవి నటించిన టాప్- 20 సినిమాలు 

సద్మా- కమల్‌హాసన్
హిమ్మత్‌వాలా – జితేంద్ర
నగీనా – రుషి‌కపూర్
మిస్టర్ ఇండియా – అనిల్‌కపూర్
గురు – మిథున్‌చక్రవర్తి
చాందినీ – రుషి‌కపూర్
చాల్‌బాజ్ – సన్నీ‌డయోల్
ఫరిష్తే – వినోద్‌ఖన్నా
లమ్హే – అనిల్‌కపూర్
ఖుదాగవా – అమితాబ్‌బచ్చన్
హీరా రాంఝా – అనిల్‌కపూర్
కర్మ్ – జాకీ‌ష్రాఫ్
రూప్ కీ రాణీ చోరోం కా రాజా – అనిల్‌కపూర్
గుమ్‌రాహ్ – సంజయ్‌దత్
చంద్రముఖి – సల్మాన్‌ఖాన్
లాడ్లా – అనిల్ కపూర్
ఆర్మీ- షారూఖ్ ఖాన్
జుదాయీ – అనిల్‌కపూర్
మేరీ బీవీ కా జవాబ్ నహీ – అక్షయ్‌కుమార్
ఇంగ్లీష్- వింగ్లీష్ – ఆదిల్‌హుస్సేన్