లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తి కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మించిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’. తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్ కె.కె.రాధామోహన్ సమర్పిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్‌తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.
శ్రీసత్యసాయి ఆర్ట్స్ కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ ..” మా ‘ఖైదీ’ చిత్రాన్ని ప్రేక్షకులు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఒక డిఫరెంట్ సినిమాని చేసిన హీరో కార్తిగారికి… ఈ సినిమాని తెలుగులో చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలు ప్రకాష్‌బాబు, ప్రభు, వివేక్‌లకు కృతజ్ఞతలు. ఒక సినిమా సక్సెస్ అయ్యి… మంచి రేటింగ్… మంచి మౌత్ టాక్ ఉంటే ఆ సంతోషమే వేరు. ‘బెంగాల్ టైగర్’ తర్వాత ప్రేక్షకులు మాకు ఇచ్చిన దీపావళి గిఫ్ట్ ‘ఖైదీ’. ఈ సినిమాలో హీరోయిన్… పాటలు లేకపోయినా రెండు గంటల ఇరవై నిమిషాలు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసిన దర్శకుడు లోకేష్ కనకరాజ్‌ని అభినందిస్తున్నాను. అతనికి ఇది రెండో సినిమా. ఫస్ట్ సినిమా ‘నగరం’ కూడా రాత్రి నేపథ్యంలోనే ఉంటుంది. మంచి హిట్ అయ్యింది. ఒక రాత్రి నాలుగు గంటల్లో జరిగే కథ అయినా.. చిత్రాన్ని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అడియన్స్‌లో ఆసక్తి కలిగించారు. ‘ఖైదీ’ సినిమాకి రివ్యూస్ చాలా గొప్పగా వచ్చాయి. ఈరోజు కలెక్షన్స్ ఇంకా పెరిగాయి..మా డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ఈ దీపావళికి ప్రేక్షకులు మాకు ఇచ్చిన కల్ట్ బ్లాక్ బస్టర్ ‘ఖైదీ’
డైరెక్టర్‌లో కంటెంట్ ఉందని…
కథ గురించి చెప్పాలంటే ఒక రాత్రి నాలుగు గంటల్లో జరిగే స్టోరి. ఒక డార్క్ నైట్ మూవీ అయినా.. హీరో, నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. లోకేష్ ‘ఖైదీ’ తర్వాత హీరో విజయ్‌తో సినిమా చేస్తున్నాడంటే ‘డైరెక్టర్‌లో కంటెంట్ ఉంద’ని అర్థం. ఇవన్నీ చూస్తుంటే సినిమా డెఫినెట్‌గా వర్కవుట్ అవుతుందనిపించింది. అందులోనూ ప్రేక్షకులు కొత్త తరహా చిత్రాల్ని కోరుకుంటున్నారు. మంచి కంటెంట్‌తో సినిమాలు వస్తే వాటిని ఆదరిస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో నేను రిలీజ్ చేయడం జరిగింది.
చాలా సింపుల్ థ్రెడ్ అయినా
నిన్న సాయంత్రం ఆర్‌కె కాంప్లెక్స్‌లో సినిమా చూశాను. చాలా సింపుల్ థ్రెడ్ అయినా మా దర్శకుడు ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. మేం ఊహించినదాని కన్నా ఇంకా 20 పర్సెంట్ బెటర్‌గా ఉంది. మల్టీప్లెక్స్‌ల్లోనూ ప్రేక్షకులు విజిల్స్ వేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా పర్‌ఫెక్ట్‌గా కుదరడం సినిమాకి చాలా ప్లస్ అయ్యింది.
ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుంది
కార్తి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా… ‘ఇలాంటి సినిమాలు రెండు గంటలే ఉండాలి. కానీ కథ మీద నమ్మకంతో 2 గంటల 20 నిమిషాలు ఉన్నా ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుంది’ అని చెప్పారు. కొద్దిసేపట్లో ఈ సినిమా సక్సెస్‌ని ఫేస్‌బుక్ ద్వారా ఆడియన్స్‌తో పంచుకున్నారు హీరో కార్తి.తమిళ్‌లో కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ కూడా పెద్ద సక్సెస్ అయ్యింది.డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ సినిమాపై ఫస్ట్ నుండి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. వారి నమ్మకానికి తగ్గట్లే మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారు
‘ఖైదీ’ సీక్వెల్ ఉంటుంది
మొన్న కార్తిగారిని కూడా ఇదే అడిగితే.. ‘ఖైదీ’ రిజల్ట్‌ని బట్టి సీక్వెల్ ఉంటుందా? లేదా! ప్లాన్ చేస్తాం’ అని చెప్పారు. అయితే ఇంతకుముందే లోకేష్ కనకరాజ్ ‘ఢిల్లీ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్’ అని ట్వీట్ చేశారు అంటే అర్థం అయింది కదా.
‘ఖైదీ’ పేరుతో వచ్చిన అన్ని సినిమాలు హిట్
‘ఖైదీ’, ‘ఖైదీ నెంబర్ 786, ‘ఖైదీ నంబర్ 150’ ఇలా.. ఖైదీ పేరుతో వచ్చిన అన్ని సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. అయితే ఈ టైటిల్ మాత్రం స్టోరి పరంగా అనుకోవడం జరిగింది. ఈ సబ్జెక్ట్‌కి కూడా ‘ఖైదీ’ యాప్ట్ టైటిల్. ఈ టైటిల్ దొరికినందుకు మా టీమ్ అంతా చాలా హ్యాపీ.
సినిమాలు నిర్మిస్తూ.. డబ్బింగ్ సినిమాలు కూడా
నేను అబ్రాడ్‌లో ఉండేవాడిని. అప్పుడప్పుడు వచ్చి నిర్మాణ పనులు చూసుకొని వెళ్లేవాడ్ని. అయితే లాస్ట్ ఇయర్ ఇండియాకి షిఫ్ట్ అయ్యాం. మా బేనర్‌లో సినిమా జరుగుతుంది. అవకాశం ఉంటే తెలుగులో మంచి సినిమా రిలీజ్ చేద్దాం అని ఈ సినిమా రిలీజ్ చేశాం. మా బేనర్‌లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తాను.
మీరు మా ‘అధినేత’ సినిమా చూస్తే మంచి మెసేజ్‌తో… అలాగే ‘ఏమైంది ఈవేళ’ కూడా ఒక కాంటెంపరరీ ఇష్యూ మీద తీసిన సినిమాలు. అలాగే ‘బెంగాల్ టైగర్’, ‘పంతం’ సినిమాలు కూడా మెసేజ్ ఒరియెంటెడే. సినిమా అనేది చాలా పెద్ద మీడియా. అందుకే మంచి సందేశాత్మక చిత్రాలు నిర్మిస్తే… ఒక టెన్ పర్సెంట్ ఆడియన్స్ అయినా ఛేంజ్ అవుతారు. అందుకే మా బేనర్‌లో అలాంటి చిత్రాలు నిర్మించడానికి ట్రై చేస్తాను. కొన్ని కథలు డెవలప్ చేస్తున్నాం. ‘ఒరేయ్ బుజ్జిగా’ పూర్తికాగానే మరో సినిమా ప్రారంభిస్తాం.
‘ఒరేయ్ బుజ్జిగా’ 50 పర్సెంట్ పూర్తి
మా బేనర్‌లో రాజ్‌తరుణ్, మాళవిక నాయర్ జంటగా కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’ షూటింగ్ 50 పర్సెంట్ పూర్తయింది. డిసెంబర్ కల్లా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది.