సీక్వెల్‌లో ‘చంద్రముఖి’ పాత్ర సిమ్రాన్ కే దక్కింది!

రజనీకాంత్‌ హీరోగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘చంద్రముఖి’ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ తెరకెక్కనుంది. ‘చంద్రముఖి’ని డైరెక్ట్‌ చేసిన పి. వాసునే ఈ సీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. ఈ రెండో భాగంలో నటించనున్నట్లు దర్శక-నటుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్‌ తెలిపారు. ‘‘రజనీకాంత్‌గారి అనుమతితో పి. వాసుగారు దర్శకత్వం వహించనున్న ‘చంద్రముఖి 2’ చిత్రంలో నేను నటించబోతున్నాను. సన్‌ పిక్చర్స్‌ కళానిధి మారన్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు’’ అని లారెన్స్‌ పేర్కొన్నారు.
 
పదిహేనేళ్ల క్రితం ‘సూపర్‌స్టార్’ రజినీకాంత్ హీరోగా దర్శకుడు పి.వాసు తెరకెక్కించిన సినిమా `చంద్రముఖి`. అప్పటివరకు వరుస ఫ్లాప్‌లతో సతమతమైన రజినీకాంత్‌ ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ లైన్ లో పడ్డాడు. ఇక, అప్పటివరకు కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే చేసిన హీరోయిన్ జ్యోతిక ఈ సినిమాలో అద్భుత నటన ప్రదర్శించింది.’చంద్రముఖి`గా జ్యోతిక నటన తెలుగు, తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా అవకాశం ముందుగా హీరోయిన్ సిమ్రాన్ వద్దకు వెళ్లిందట. వ్యక్తిగత కారణాల వల్ల సిమ్రాన్ ఈ సినిమా చేయలేకపోయింది. పి.వాసు దర్శకత్వంలోనే `చంద్రముఖి` సీక్వెల్ తెరకెక్కనుంది. రాఘవ లారెన్స్ ఈ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో `చంద్రముఖి` పాత్ర సిమ్రాన్‌కు దక్కినట్టు తెలుస్తోంది. తొలి`చంద్రముఖి`లో నటించలేకపోయినా ఆ సినిమా సీక్వెల్‌లో మాత్రం సిమ్రాన్ నటించడం విశేషం.