అత్యధికంగా తుపాకులు కలిగివున్న దేశాల జాబితాలోప్రపంచ దేశాలోనే మొదటి స్థానంలో ఉన్నది అమెరికా. ఆ తుపాకి కాల్పులలో అధికంగా బలైపోతున్నవారు భారతీయులేనని గణాంకాలు చెబుతున్నాయి . ఈ పాయింట్ తో ప్రధానంగా ‘కిక్’ శ్యామ్ హీరోగా సారథి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వాడొస్తాడు’. కె.వి.శబరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని అమెరికాలోని లాస్ వేగాస్‌లో హాలీవుడ్ స్థాయిలో చిత్రీకరించారు. ఈ చిత్రం ట్రైలర్ ను దర్శకుడు లింగుస్వామి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో మంచి వ్యూస్ సాధిస్తోంది .
అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ…‘‘ఇందులో డిఫరెంట్ పాత్రలో హీరోగా శ్యామ్ నటిస్తున్నారు. హీరోయిన్‌గా ఆత్మీయ …మరో హీరోయిన్‌గా శ్రీదేవి కుమార్ నటించారు. పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో చిత్రీకరించాం. స్టోరి సినిమాకు హైలెట్. అన్ని కార్య క్రమాలు పూర్తి చేసి అక్టోబర్‌లో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తాం ’’ అన్నారు.
ఈ చిత్రానికి దర్శకత్వం:సారథి, నిర్మాత: కె.వి.శబరీష్, సినిమాటోగ్రఫీ:ఎన్‌ఎస్ రాజేష్‌కుమార్, సంగీతం:ఎమ్‌ఎమ్, ఎడిటింగ్: ఏకెడి అరుణ్ థామస్; ఆర్ట్: టియన్ కపిలన్, స్టంట్స్: శివ; పాటలు :వనమాలి, సంభాషణలు :కృష్ణతేజ.