సరైన వ్యక్తి తారసపడితే.. ప్రేమలో పడతా!

సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను అంటోంది శ్రుతి.తను కోరుకున్న లక్షణాలు కల వ్యక్తి తారసపడితే.. అతడితో ప్రేమలో పడతా.. ప్రపంచానికి అతడిని పరిచయం చేస్తాన”ని అంటోంది శ్రుతి హాసన్‌. ఇటీవల ఆమె సినిమాలకు కాస్త విరామం ఇచ్చింది. ఆ సమయంలో ఇటాలియన్‌ బాయ్‌ఫ్రెండ్‌ మైఖేల్‌ కోర్సలేతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగింది .ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ సందడి చేసింది . కొన్ని సంవత్సరాలుగా రిలేషన్‌లో ఉన్న వీరు ఈ ఏడాది ఏప్రిల్‌లో విడిపోయారు .తమ ‘బ్రేక్‌అప్‌’ విషయాన్ని మైఖల్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.మైకేల్‌తో ప్రేమకు బ్రేకప్ చెప్పేసి మళ్లీ కెరీర్‌పై శృతి దృష్టి పెట్టింది.
 
తాజాగా ఓ రియాలిటీ షో లో మైఖేల్‌తో బ్రేక్‌ అప్‌ గురించి చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్‌… ‘మైఖేల్‌తో బంధం తనకో మంచి అనుభవాన్ని మిగిల్చింద’న్నారు . “నేను చాలా అమాయకంగా ఉండటంతో.. నా చుట్టు ఉన్న వారు నాపై ఆధిపత్యం చెలాయిస్తూ.. బాస్‌లా ప్రవర్తిస్తుంటారు . నాలో భావోద్వేగాలు ఎక్కువ కావడంతో… నా చుట్టు ఉన్న వారు నన్ను తమ అధీనంలో ఉంచుకోవాలని భావిస్తారు. అయితే ఇవన్ని కూడా నాకు మంచి అనుభవాలనే మిగిల్చాయి’ అని చెప్పింది .
 
శ్రుతి జీవితంలో సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను అంటోంది .తను కోరుకున్న లక్షణాలు కల వ్యక్తి తారసపడితే.. అతడితో ప్రేమలో పడతా.. ప్రపంచానికి అతడిని పరిచయం చేస్తానని అంటోంది శ్రుతి. ప్రేమలో పడటానికి ప్రత్యేకంగా ఎలాంటి ఫార్ములాలు ఉండవని అంటోంది శ్రుతి. ఒక సమయంలో మంచివాడిగా అనిపించిన ఓ వ్యక్తి…. అదే సమయంలో చెడ్డగా కనిపిస్తాడని అంటోంది . ఇలాంటి విషయాల గురించి తాను బాధపడనంది . ఇవన్ని తనకు నేర్చుకునే అవకాశం ఇచ్చాయని .. తనకు మంచి అనుభవాలుగా మిగిలిపోతాయంది .
 
మనసుకు నచ్చని పని ఏదో…
ప్రతి వారికి తమ రోజువారి జీవితంలో రకరకాల అలవాట్లు ఉంటాయి. ఉదయం నిద్ర లేచిన దగ్గరనుంచి మళ్లీ రాత్రి పడుకునే వరకు ఏవో కొన్ని పనులు చేస్తుంటారు. అయితే శృతిహాసన్ నిద్రించే ముందు ఓ పని తప్పనిసరిగా చేస్తుందట. ఆమె తండ్రి కమల్‌హాసన్ చిన్నప్పుడే ఓ విషయం నేర్పించారట. అదేమిటంటే… ఏ రోజైనా సరే.. ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రించలేకపోతే… ఆ రోజున మనసుకు నచ్చని పని ఏదో చేసి ఉంటామని అర్థం చేసుకోవాలని చెప్పారట కమల్.
 
తన జీవితంలో ఈ మాటలను మరచిపోనంటున్న శృతిహాసన్… ప్రతి రోజు నిద్రపోయే ముందు ఆ రోజు చేసిన అన్ని పనులను గుర్తుచేసుకుంటానని ..ఏదైనా తప్పు చేసి ఉంటే మాత్రం.. వాటిని జీవితంలో మళ్లీ చేయకూడదని నిర్ణయించుకుంటుందట. అలా చేసిన తర్వాతే తనకు ప్రశాంతంగా నిద్ర పడుతుందని శృతిహాసన్ చెప్పింది. ప్రతి రోజు నిద్రించేముందు ఆరోజు మొత్తాన్ని మళ్ళీ గుర్తుచేసుకోకపోతే ఏదో వెలితిగా ఉంటుందని ఆమె పేర్కొంది.