శృతి హాసన్ ‘గబ్బర్ సింగ్’ తో సక్సెస్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ రేంజ్‌కి వెళ్లింది. అయితే మైఖేల్ కోర్సెల్ అనే వ్యక్తితో ప్రేమాయణంలో పడ్డ తర్వాత దాదాపు రెండేళ్ళపాటు సినిమాలకి దూరంగా ఉంది. ఇటీవల వారి ప్రేమకి ఫుల్ స్టాప్ పడడంతో మళ్ళీ సినిమాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో విజయ్‌సేతుపతి సరసన ‘లాభం’ అనే చిత్రం, టాలీవుడ్‌లో రవితేజతో ఒక చిత్రం చేయనుంది. తాజాగా ఈ శృతికి జాక్‌పాట్ తగిలింది.
అమెరికాకి చెందిన ‘ట్రెడ్‌స్టోన్’లో శృతి హాసన్ కీలక పాత్ర ఎంపికైంది. అంతర్జాతీయ వెబ్ సిరీస్‌గా రూపొందనున్న ట్రెడ్ స్టోన్‌ని రామిన్ బహ్రానీ తెరకెక్కించనున్నారు. ఢిల్లీలో ఒక హోటల్‌లో వెయిట్రెస్‌గా పని చేస్తూ రహస్యంగా హత్యలు చేసే యువతిగా శృతి నటించనుందని సమాచారం. హంగేరీలోని బుడాపెస్ట్ ప్రాంతంలో జరగనున్న షెడ్యూల్‌లో శృతిహాసన్ పాల్గొననున్నారు. నీరా పటేల్ అనే పాత్రలో శృతి కనిపించనుందని తెలుస్తుండగా, ప్రస్తుతం తన పాత్రకి సంబంధించిన ప్రిపరేషన్‌లో ఉందట శృతి. అంతర్జాతీయ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న తొలి సౌత్ భామ శృతి కాగా, ఈ అమ్మడికి ఈ సిరీస్‌తో అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తే.. హాలీవుడ్ తలుపు తట్టడం ఖాయం అని విశ్లేషకులు అంటున్నారు.
ఈ బ్రేకప్ నిర్ణయం సరైనదే !
‘‘జీవితం మనల్ని భూమి మీద చెరోవైపు ఉంచింది. అందుకే ఇకపై విడిగా నడవాలేమో?’’ అంటూ తమ బ్రేకప్‌ను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు మైఖేల్ కోర్సలే. శ్రుతీహాసన్, మైఖేల్ కోర్సలే రెండు సంవత్సరాలుగా రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా తమ బంధానికి ఇరువురు ఇష్టప్రకారమే వీడ్కోలు చెప్పుకున్నారు.
ఈ బ్రేకప్‌కి కారణం ఇదే! ..అంటూ తమిళనాడులో ఓ వార్త తిరుగుతోంది. దాని సారాంశం ఏంటంటే … మైఖేల్ కోర్సలే నిర్లక్ష్యమే ఈ బ్రేకప్‌కి ప్రధాన కారణమట.లండన్‌లోని థియేటర్ ఆర్టిస్ట్ మైఖేల్. ఇప్పటికీ తన కాళ్ల మీద తాను నిలబడకుండా తల్లిదండ్రులపైనే ఆధారపడ్డాడట అతను. నీ వైఖరిని మార్చుకోవాలి, నీ అంతట నువ్వు నిలబడాలి, సొంతంగా ఏదైనా చేయమంటూ శ్రుతీ చాలాసార్లు మైఖేల్‌కు చెప్ప డం జరిగిందట. కానీ శ్రుతీహాసన్ చెప్పిన మాటలను మైఖేల్ సీరియస్‌గా తీసుకోలేదని సమాచారం. ఇది శ్రుతీకి కష్టంగా అనిపించిందట. నేను తీసుకున్న ఈ బ్రేకప్ నిర్ణయం సరైనదేనని శ్రుతీహాసన్ చెబుతోంది