ఈ పోటీ ప్రపంచంలో నేను భాగం కాను !

‘తనకు నచ్చిన విధంగా చేసుకుంటూ వెళ్లడంలోనే ఎంతో ఆనందం ఉంద’ని శ్రుతి హాసన్‌ చెబుతోంది. ఉరుకులు పరుగులుగా ఉండే ఈ పోటీ ప్రపంచంలో తాను భాగం కాకూడదని అనుకుంటున్నట్టు శ్రుతి హాసన్‌ చెప్పింది. తనకు నచ్చిన విధంగా చేసుకుంటూ వెళ్లడంలోనే ఎంతో ఆనందం ఉందని చెబుతుందీమె. ప్రస్తుతానికి తాను పాటలు రాయడం, లండన్‌లోని అంతర్జాతీయ ఆర్టిస్టులతో కలసి షోలు చేయడంపైనే దృష్టి సారించినట్టు శ్రుతి వెల్లడించింది. ‘నేను సినిమాలు చేస్తున్నప్పుడు స్టేజ్‌ షోలపై ఎందుకుదృష్టిసారించలేకపోతున్నారని చాలా మంది నన్ను అడిగేవారు. అదే నాకు తొలి ప్రాధాన్యం కూడా. మా నాన్న గారు(కమల్‌ హాసన్‌) కూడా నేను సంగీత రంగంలోకి రావాలని పట్టుబట్టేవారు’ అని చెప్పింది.
 
ప్రస్తుతం శ్రుతి హాసన్‌ మ్యూజిక్‌ షోలు చేస్తోంది. దానిలో భాగంగా విదేశాల్లో ఎక్కువగా గడుపుతుంది. ‘నేను లైవ్‌ ఆడియెన్స్‌కు కనెక్ట్‌ అవుతున్నా. పాడడం, డాన్స్‌ చేయడం అంటే నాకిష్టం. వాటి నుంచి నేను శక్తిని పొందున్నట్టు అనిపిస్తుంది. నేను ఇటీవల చేసిన ఇంగ్లిష్‌ ఆల్బమ్‌ వల్ల అద్భుతమైన స్పందనను పొందాను. లాస్‌ఏంజెల్స్‌గానీ, లండన్‌లోగానీ నాలాంటి వాళ్లు లేరని తెలిసింది. ఈ విధంగా చేస్తున్న వ్యక్తిని నేను అనుకుంటున్నా’ ‘ అని తెలిపింది శ్రుతి.
నేను నిర్మాతగా కూడా మారుతున్నా !
సినిమాలకు ఎందుకు దూరమవుతున్నారన్న దానిపై ఆమె స్పందిస్తూ…’ నా జీవితం అంతా సినిమా ఇండిస్టీకే డెడికేట్‌ చేస్తున్నా. అయితే ఉరుకులు పరుగుల పందెంలో నేను భాగంగా కాదలుచుకోలేదు. ఇక్కడ నేనేదో ‘డబ్బులు సంపాదించాలనో, లేకపోతే అవార్డులు కొట్టేయాలనో’ అన్నది నా ఆలోచన కాదు. ప్రతి ఒక్కరూ తమలో ఉండే కొన్ని ఆశయాలు సాధించుకోవడానికి వాళ్లు చేస్తున్న వృత్తి నుంచి కొంత విరామం తీసుకొచ్చు. నేను అందరిలా కాదు. నేనొక మనిషిని. యంత్రాన్ని కాదు. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే… నేను పని చేయగలనో లేదో నాకు తెలుసు. కంప్యూటర్‌ కూడా ఉత్తమంగా పని చేయాలంటే ఒక్కోసారి షడౌన్‌ చేయాల్సి ఉంటుంది. త్వరలో కథానాయికగా ఓ సినిమా చేస్తున్నా. విజయ్ సేతుపతి హీరో. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు. ఎస్‌పీ జననాథన్‌ దర్శకత్వం. దీంతో పాటు నేను నిర్మాతగా కూడా మారుతున్నా. జయప్రకాశ్‌ రాధాకృష్ణ నటించే తర్వాత చిత్రాన్ని ఇసిడ్రో మీడియా బ్యానర్‌లో నేనే నిర్మిస్తున్నా’ అని పేర్కొంది శ్రుతి