శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్ర పూజా కార్యక్రమాలు సంస్థ ఆఫీసులో జరిగాయి.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ”ఈ చిత్రాన్ని తమిళ డైరెక్టర్, కెమెరా మెన్ అయిన విజయ్ మెల్టన్ గారి సహాయ దర్శకులు, ఫిలిం ఇన్సిస్ట్యూట్ లో DFT చేసిన పాతికేళ్ల కుర్రాడయిన బాలమురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు. పదేళ్ళకి పైగా తెలుగు సినిమాల్లో విలన్ గా నటిస్తున్న శ్రవణ్ ని హీరోగా పరిచయం చేస్తున్నాం. మలయాళ నటి అయిన లియోనా ఈశాయ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. నటుడు సంపత రాజ్ ఒక వినూత్నమైన క్యారెక్టర్ లో నటించబోతున్నారు. ఈ చిత్రం త్రీ టైం పిరీయడ్స్ పారలర్ గా జరిగే స్క్రీన్ ప్లే తో ఉంటుంది. తెలుగు సినిమాలో ఇది ఒక కొత్త ప్రయోగం అవుతుంది. దీనికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ధనేష్ నిడు మారన్ ఇస్తున్నారు. తెలుగు అనువాదం రాకేందుమౌళీ చేస్తున్నారు. అలాగే కెమెరామెన్ గా రత్నవేలు గారి అసోసియేట్ విజయ్ అర్పుతారాజ్ చేస్తున్నారు. ఈయన లింగ, కుమారి 21 F, బ్రహ్మోత్సవం మొదలయిన సినిమాలకి అసోసియేట్ కెమెరామెన్ గా వర్క్ చేశారు. తమిళ్ లో పిశాచి, సూర్యగాలి, మేము, డిటెక్టివ్ వంటి సినిమాలకి సంగీతం వహించిన అరోల్ కొరెల్లి సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెల 2 వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.” అన్నారు.
ఈ సినిమాకి కధే ప్రధానమని డైరెక్టర్ బాలమురుగన్ చెప్పారు.
రెగ్యులర్ క్యారెక్టర్ తో కాకుండా, కథతో ట్రావెల్ అయ్యే ఒక డిఫరెంట్ రోల్ తో హీరోగా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని హీరో శ్రవణ్ తెలిపారు.
ఈ చిత్రానికి రైటర్: ధనేష్ నిడు మారన్, కెమెరా: విజయ్ అర్పుతారాజ్, సంగీతం: అరోల్ కొరెల్లి, ఎడిటర్: నాగూరన్ రామచంద్రన్, ఆర్ట్: గోపీ, ఫైట్స్: వెంకట్, నిర్మాత: బోగారి లక్ష్మీనారాయణ, డైరెక్టర్: బాలమురుగన్.