బాలీవుడ్‌లో పెళ్ళి సందడి కొనసాగుతోంది. అనుష్క శర్మ, సోనమ్ కపూర్, దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా పెళ్ళిళ్లు చేసుకున్నారు. ఇటీవలే దక్షిణాదిలో విశాల్, ఆర్య ఎంగేజ్‌మెంట్ చేసుకుని పెళ్ళికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లో మరో కథానాయిక శ్రద్ధా కపూర్ సైతం పెళ్ళి పీఠలెక్కేందుకు రెడీ అవుతోందట. ఆమె ప్రేమ వివాహానికి సంబంధించి అన్ని రకాల గ్రీన్ సిగల్స్ వచ్చాయట. ఇంతకి శ్రద్ధ పెళ్ళి చేసుకోబోయేది ఎవరనే డౌట్ రావచ్చు. రోహన్ శ్రేష్ట అనే ఫొటోగ్రాఫర్‌తో గత కొంత కాలంలో శ్రద్ధ ప్రేమలో ఉంది. ఇరు కుటుంబాల పెద్దలకు తమ ప్రేమ విషయం చెప్పగా, అందుకు వారు గ్రీన్ సిగల్ ఇచ్చారని, వచ్చే ఏడాది మ్యారేజ్ చేసుకోవాలని శ్రద్ధా, రోహన్ ప్లాన్ చేసుకుంటున్నారట. శ్రద్ధ అలనాటి నటుడు శక్తి కపూర్ కూతురు అన్న విషయం తెలిసిందే. 2010లో ‘టీన్ పత్తీ’ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా బాలీవుడ్‌లో అగ్ర స్థానానికి ఎదిగి క్రేజీ కథానాయికగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ట్రైలింగ్వల్ ‘సాహో’తోపాటు ‘చిచ్చోర్’,’స్ట్రీట్ డాన్సర్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె డెంగీ జ్వరం వల్ల ఇటీవల సైనా నెహ్వాల్ బయోపిక్ నుంచి తప్పుకుంది.
అవన్నీ చెత్తవార్తలే. వాటిలో నిజం లేదు !
తన కుమార్తె శ్రద్ధా కపూర్ మరో ఐదేళ్ల వరకు పెళ్లి చేసుకోదని ఆమె తండ్రి, బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ స్పష్టం చేశారు. ‘సాహో’ భామ త్వరలోనే వివాహం చేసుకోబోతోందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రోహన్ శ్రేష్ఠ అనే ఫొటోగ్రాఫర్‌తో ఆమె ప్రేమలో ఉన్నారని, 2020లో వీరి వివాహ వేడుక జరగబోతోందని ప్రచారం జరిగింది. శ్రద్ధ వయసు 32 ఏళ్లు కావడంతో ఇంట్లో వాళ్లు తొందరపెడుతున్నారని కూడా చెప్పుకొచ్చారు.
ఈ వదంతులపై శక్తి కపూర్ స్పందించారు…. ఆ వార్తల్లో నిజం లేదని అన్నారు. ‘అవన్నీ చెత్తవార్తలే. వాటిలో నిజం లేదు. శ్రద్ధకు మరో ఐదేళ్ల వరకూ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఆమె చేతిలో ప్రస్తుతం ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. వాటితో బిజీగా ఉంది. మరో రెండేళ్లు ఆమె క్యాలెండర్ పూర్తిగా నిండిపోయింది’ అని ఆయన చెప్పారు.
అనంతరం రోహన్‌తో ప్రేమ గురించి ప్రశ్నించగా.. ‘గత కొన్నేళ్లుగా ‘శ్రద్ధ ఇతడ్ని ప్రేమిస్తోంది’ అంటూ చాలా మంది పేర్లు చెప్పారు. ఇది చిత్ర పరిశ్రమ.. ఇక్కడ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా.. అలానే అంటుంటారు. అంత మాత్రాన ఏదో అయిపోయినట్లు కాదు. రోహన్ తండ్రి రాకేశ్ నాకు మంచి స్నేహితుడు. మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్. నా కుమార్తె తన జీవితంలో జరిగే ప్రతి విషయం నాకు చెబుతుంది. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఆమె పెళ్లి చేసుకోదు’ అని శక్తి తెలిపారు