శ్రద్ధా కపూర్ చేసిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ ఒకటి, రెండోది ‘చిచ్ఛోరే’. ఈ రెండు చిత్రాలూ మంచి రివ్యూలను రాబట్టులేకపోయినా… బాక్సాఫీస్ వద్ద మాత్రం వసూళ్ళు కురిపించాయి. ‘సాహో’ హిందీలోనే 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా రాబట్టింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో చేసిన ‘చిచ్ఛోరే’ 100 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది. గత ఏడాది పాటు శ్రద్ధా సినిమాలు రాలేదు. కాగా..ఈ రెండు చిత్రాలు ‘సాహో’ , ‘చిచ్ఛోరే’ పరాజయం పొందాయి. ఈ సినిమాల గురించి శ్రద్ధా మాట్లాడుతూ …
“జయాపజయాలు నటుల జీవితాల్లో భాగం. విజయం సాధించినా.. ఒక నటిగా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ‘సాహో’ ఓ మాస్ ఎంటర్‌టైనర్. ‘సాహో’ పై నెగిటివ్ రివ్యూస్ వచ్చినా సరే కలెక్షన్స్ తో ప్రేక్షకులు ఆదరించారు. అది చాలా గొప్పవిషయం. చేసే పనిపై ఎప్పుడూ విమర్శలు ఉంటాయి. విమర్శలు రాకుండా నేను ప్రయత్నిస్తా”.. అని చెప్పింది.
వరుణ్ ధావన్‌తో చేస్తున్న ‘స్ట్రీట్ డాన్సర్ 3డీ’ సినిమా గురించి చాలా ఎగ్జయిట్ అవుతున్నట్టు చెప్పింది.. ” స్ట్రీట్ డాన్సర్ 3డీ’ చిత్రం కోసం మా చిత్రబృందం పూర్తిగా మనసు పెట్టి పని చేస్తున్నాం. దీని కోసం కొన్ని గంటల పాటు ప్రాక్టీస్ చేస్తున్నాం. ‘ఏబీసీడీ 2’ సినిమాను ఎక్కువగా ప్రేమించా. ఆ చిత్రంలో పని చేసిన అనుభవం ‘స్ట్రీట్ డాన్సర్ 3డీ’కి పనికొచ్చింది. ఇటీవల ‘బాఘి 3′ షూటింగ్ ప్రారంభించాం. ఈ సినిమా చాలా ఫన్‌గా ఉంటుంది. అదే నటీనటులతో ఈ సినిమాకీ పని చేస్తున్నా.చాలా కంఫర్ట్ ఫీలవుతున్నా’ అని తెలిపింది.
మేకప్ లేకపోతేనే సౌకర్యం
నేను నాలాగే ఉండాలనేది నా స్టైల్ స్టేట్‌మెంట్. ఎవరినో అనుకరిస్తే మిగిలేది ‘అనుకరణ’ తప్ప ‘అందం’ కాదు. ఒళ్లు తెలియకుండా నిద్రపోయేవాళ్లను చూస్తే ముచ్చటేస్తుంది. సరైన నిద్ర లేకపోతే ఎంత కష్టపడి ఏంలాభం. మంచి నిద్ర, ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం, అందంగా ఉంటాం.
విశాల్ భరద్వాజ్ ‘హైదర్’ సినిమాలో కశ్మీరీ అమ్మాయి ‘అర్షియా’ పాత్ర పోషించాను. మేకప్ లేకుండా నటించాను. ‘అందంగా కనిపించలేదు’ అని ఒక్కరూ అనలేదు. మేకప్‌తోనే అందం వస్తుందంటే నేను నమ్మను. నిజంగా చెప్పాలంటే మేకప్ లేకపోతేనే నాకు సౌకర్యంగా, సంతోషంగా, సహజంగా అనిపిస్తుంది.
సెట్‌లో లేనప్పుడే ఒత్తిడి
పని మీద ప్రేమ ఉంటే… ఒత్తిడే ఉండదు. నావరకైతే ఫిల్మ్‌సెట్‌లో లేనప్పుడే ఒత్తిడికి గురవుతాను. ‘ఇప్పుడు ఏం చేయాలి?’అని పదేపదే ఆలోచిస్తూ ఒత్తిడికి గురవుతుంటాను. ఒత్తిడిని దూరంగా ఉంచడానికి మరో మార్గం.. కుటుంబ సభ్యులతో గడపడం. ఈ పని నేను ఎక్కువగా చేస్తుంటాను.
‘నా పనికి ఎంత న్యాయం చేశాను?’.. అనేదే ఆలోచిస్తాను తప్ప… హిట్, ఫ్లాప్‌లను మనసుకి తీసుకోను. ఫ్లాప్ కు బాధ పడితే ‘బాధ’ తప్ప ఏమీ మిగలదు. కాబట్టి, బాధపడడం ఎందుకు. స్క్రిప్ట్ వింటున్నప్పుడు ‘ఈ సినిమా కచ్చితంగా హిట్ కొడుతుంది’ అనిపిస్తుంది. అన్నిసార్లూ మన అంచనా నిజం కాకపోవచ్చు. జయాపజయాలు ప్రేక్షకుల చేతుల్లో ఉన్నాయి. దాన్ని మనం అంగీకరించాలి .