రొటీన్ … ‘రాధ’ చిత్ర సమీక్ష |
|
సినీవినోదం రేటింగ్ : 2.5/5 శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై చంద్రమోహన్ దర్శకత్వం లో బోగవల్లి బాపినీడు ఈ చిత్రాన్ని నిర్మించారు చిన్నతనంలోనే కృష్ణతత్వానికి ఆకర్షితుడై ఎప్పుడు భగవద్గీత వింటూ భగవంతుడే అంతా నడిపిస్తున్నాడని నమ్ముతుంటాడు రాధకృష్ణ. ఒకసారి తనను ప్రమాదం నుంచి కాపాడిన పోలీసే కృష్ణుడని నమ్మి కష్టాల్లో ఉన్నవారిని కాపాడే పోలీసు అవ్వాలని ఫిక్స్ అవుతాడు. అదే కసితో పెరిగి పెద్దవాడైన రాధకృష్ణ.. యూనిఫాం లేకపోయినా క్రిమినల్స్ ఆట కట్టిస్తుంటాడు. డిపార్ట్మెంట్ కు కృష్ణ చేసిన సాయాన్ని గుర్తించిన డీజీపీ.. రాధకు ఎస్సైగా ఉద్యోగం ఇప్పిస్తాడు. కేసులు లేని స్టేషన్ లో పనిచేయటం ఇష్టం లేదని కోరి మరీ ఎప్పుడూ కేసులు క్రిమినల్స్ తో కలకలలాడే ధూల్ పేట్ స్టేషన్ కు ట్రాన్సఫర్ తెచ్చుకుంటాడు. రాధ చార్జ్ తీసుకున్న టైంలో పీపుల్స్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో గొడవలు జరుగుతుంటాయి. సిట్టింగ్ సీఎం (కోట శ్రీనివాసరావు) తన తరువాత ముఖ్యమంత్రిగా సుజాత (రవికిషన్), సూర్రెడ్డి (ఆశిష్ విద్యార్థి)ల్లో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని హైకమాండ్ కు సూచిస్తాడు. అదే సమయంలో సుజాత మీటింగ్ లో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఈ బ్లాస్ట్ లో కార్యకర్తలతో పాటు పోలీసులు కూడా చనిపోతారు. పోలీసులు తాగి నిర్లక్ష్యంగా వ్యవహరించటం కారణంగానే ఇలా జరిగిందన్న ప్రచారం జరుగుతుంది. పోలీసుల మీద ఈగ వాలితేనే ఒప్పుకొని రాధకృష్ణ.. పోలీసుల మీద పడ్డ నింద ఎలా చెరిపేశాడు..? అసలు సుజాత మీటింగ్ లో బాంబ్ బ్లాస్ట్ చేసింది ఎవరు..? వాళ్ల ఆట రాధకృష్ణ ఎలా కట్టించాడు..? అన్నది సినిమాలో చూడాలి …. . దర్శకుడు చంద్ర మోహన్ అనుకున్న పాయింట్ మంచిదే. అయితే దాని చుట్టూ సన్నివేశాలు అనుకున్నంత స్థాయిలో బలంగా లేవు. సినిమా ప్రారంభం నుంచీ రొటీన్‌గానే సాగుతూ గతంలో చూసిన అనేక చిత్రాలని తలపిస్తూ ముందుకి వెళుతుంది.ఫస్టాఫ్ చాలా వరకు చప్పగా నడవడం, అసలు కథ విశ్రాంతి సమయానికి కానీ మొదలవకపోవడం వంటి మైనస్ లు ఉన్నాయి .అసలు కథ మొదలైన తరువాత వచ్చిన లవ్ సీన్స్ ఇబ్బంది పెడతాయి.ద్వితీయార్ధం అంతా రొటీన్‌గా మారింది. విలన్ ఏం చేస్తున్నాడో, హీరో ఏ ఎత్తు వేస్తున్నాడో, తర్వాత ఏమి జరగబోతుందో అన్నీ ముందే తెలిసిపోతూ వుంటాయి. సినిమాలో ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ ‘గబ్బర్ సింగ్’ను పోలి ఉంటే , సెకండాఫ్ ‘రేసుగుర్రం’లా ఉంది. హీరో విలన్‌ను వెర్రోడిని చేసే సన్నివేశాలు, విలన్‌పై హీరో పగ తీర్చుకునే సన్నివేశాలు రేసుగుర్రంను తలపిస్తాయి. అలాగే క్లైమాక్స్ కూడా రేసుగుర్రం తరహాలోనే ఉంటుంది. చాలా వరకు సీన్స్ ఎక్కడో తెలుగు సినిమాల్లో చూసినట్లుగానే అనిపిస్తాయి. శర్వానంద్ మరోసారి ఎనర్జిటిక్ పెర్‌ఫార్మెన్స్ చేశాడు.సినిమా మొత్తాన్ని తన భుజాల మీదే మోస్తూ ఆద్యంతం అలరించాడు. పోలీసాఫీసర్ అవ్వాలనే తపన ఉన్న కుర్రాడిగా అతని పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. శ్రీకృష్ణుడి రిఫరెన్సులతో అతని పాత్రకు రాసిన సంభాషణలు ఆసక్తికరంగా సాగాయి. అయితే పాత్రకు తగ్గట్టు, సినిమా సినిమాకు శర్వానంద్ హెయిర్ స్టైల్ మారిస్తే బాగుంటుంది . హీరోయిన్ పాత్రకు కథలో పెద్దగా అవకాశం లేకపోవటంతో లావణ్య గ్లామర్ షోతో సరిపెట్టుకుంది. ఉన్నంతలో లవ్ సీన్స్ లో అందం తో మెప్పించింది.శర్వానంద్ తో సప్తగిరి, షకలక శంకర్ ల వర్కవుటైంది. ఇంటర్వెల్ సన్నివేశం కూడా కాస్త థ్రిల్లింగ్ గా అనిపించింది. సినిమా ఆఖరున అసలు రాధ ఆ పొలిటీషియన్ ను అంత సీరియస్ గా తీసుకోవడానికి కారణం ఏమిటి, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాముఖ్యత ఏమిటి అని చెప్పే ఎపిసోడ్స్ ఎమోషనల్ గా బాగున్నాయి . విలన్ గా చేసిన రవి కిషన్ తన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.ఇతర పాత్రల్లో ఆశిష్ విద్యార్థి, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, అక్ష నటించారు . రాధన్ సంగీతం కమర్షియల్ సినిమాల స్థాయికి తగ్గట్టు లేకుండా సాదాసీదాగా ఉంది.పాటల్లో గుర్తుంచుకునేదీ,ఇంకోసారి వినాలనిపించేది ఏదీ లేదు.ఎడిటింగ్ పర్వాలేదు.కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. సినిమా చాలా కలర్‌ఫుల్‌గా,ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా అనిపిస్తుంది – ధరణి |