టాలీవుడ్‌లో సంచలన విజయాన్ని సాధించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు. విజయ్‌దేవరకొండ, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి వారికి భారీ క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ఆతర్వాత వీరిద్దరికీ వరుసగా మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం షాలిని పాండే తమిళ్‌లో కూడా నటిస్తోంది. అయితే ఈ భామ తనలోని కొత్త టాలెంట్‌ను చూపిస్తోంది. ప్రస్తుతం షాలిని కోలీవుడ్‌లో ‘100%కాదల్’ అనే సినిమాలో నటిస్తోంది. జివి ప్రకాష్‌కుమార్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. షాలిని పాటలను చాలా బాగా పాడుతుందట. తాజాగా రిలీజ్ చేసిన ఒక ప్రోమోలో ఈ భామ పాట అందరినీ అలరిస్తోంది. ప్రేమికుల రోజు కానుకగా ‘నా ప్రాణమే’ అనే ప్రైవేట్ సాంగ్‌తో వస్తోంది షాలిని. ఇండియన్ పాప్ రాక్‌బ్యాండ్ కంపోజ్ చేసిన మ్యూజిక్‌కు అనుగుణంగా షాలిని చక్కగా పాడి ఆకట్టుకుంది. ఈనెల 14న ఈ ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేసారు….
https://www.youtube.com/watch?