బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ తనకు కరోనా కాలంలో ఎదురైన అనుభవాలకు అక్షర రూపమిచ్చి పుస్తకంగా తీసుకొచ్చే పనిలో పడ్డారు. కొవిడ్-19 కారణంగా గత 55 రోజులుగా సినిమా షూటింగ్‌లు లేక ఇంటికే పరిమితమై కుటుంబసభ్యులతో గడుపుతున్నారాయన. ఈ వైరస్ లాక్‌డౌన్ వేళ తానెదుర్కొన్న అనుభవాలను ‘ఓం శాంతి ఓం’ పేరిట పుస్తకం రాసేందుకు తలపెట్టినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “మనం మన అవసరాలకు మించి జీవిస్తున్నాం. వీటిలో చాలావరకు అనుకున్నంత ముఖ్యమైనవేవీ కావు. ‘మనం లాక్‌డౌన్‌కు గురైనప్పుడు మాట్లాడాలని భావిస్తున్న వారికంటే.. మన చుట్టూ ఎక్కువ మంది అవసరం లేదు’ అని అభిప్రాయపడుతున్నా” అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కొవిడ్-19 సమయంలో ప్రభుత్వానికి విరాళం ప్రకటించడంతో పాటు షారుఖ్ ఖాన్.. తన అభిమానుల ఆధ్వర్యంలో అవసరార్ధులకు నిత్యావసర వస్తువులు అందించి ఆదుకొంటున్నారు.
షారుఖ్ వెబ్ సిరీస్ కు చిక్కులు
షారుఖ్ ఖాన్ తాజాగా నిర్మించిన ఓ వెబ్ సిరీస్ లీగల్ ఇష్యూలో చిక్కుకుంది. షారుఖ్ ఖాన్‌కు గత కొంత కాలంగా సరైన హిట్టు లేదు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ తర్వాత ఈ బాలీవుడ్ బాద్‌షా హిట్టు ముఖం చూసిందే లేదు. ఒకపుడు బాలీవుడ్‌లో సినిమాలు నడవాలంటే.. అందులో ‘సెక్స్ అయినా ఉండాలి. లేకపోతే షారుఖ్ అయినా ఉండాలి’ అనే వారు. షారుఖ్ తన స్థాయికి తగ్గట్టు హిట్టు ఇవ్వలేక చాలా ఏళ్లే అవుతుంది. 2018 చివర్లో ‘జీరో’ సినిమా తర్వాత షారుఖ్.. మరో సినిమా ఒప్పుకోలేదు. ఆయన అభిమానులు కూడా షారుఖ్ ఖాన్ సినిమాల్లో నటిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. ప్రస్తుతం హీరోగా షారుఖ్ ఖాన్ మార్కెట్ కూడా దారుణంగా పడిపోయింది.
తాజాగా షారుఖ్ రెడ్ చిల్లీస్ పతాకంపై వెబ్ సిరీస్ నిర్మిస్తున్నాడు. అందులో భాగంగా ఆయన ‘బేతాళ్’ అనే వెబ్ సిరీస్ నిర్మించారు. ఇందులో వినీత్ కుమార్, అహనా కుమ్రా, సుచిత్రా పిళ్లై, జితేంద్ర జోషి నటించారు. ఈ వెబ్ సిరీస్‌ను నిఖిల్ మహాజన్, పాట్రిక్ గ్రాహం డైరెక్ట్ చేసాడు. ఈ వెబ్ సిరీస్ తొలి సీజన్ ఈ నెల 24న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.హార్రర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సిరీస్ కథ, తమ సినిమా ‘విటాళ్’ కథకు పోలికలున్నాయని స్క్రీన్ రైటర్స్ సమీర్, మహేశ్ ముంబాయి హైకోర్టును ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో హైకోర్టు ‘బేతాళ్’ షో ప్రసారంపై స్టే విధించింది. మేము మా కథతో ఎంతో మంది దగ్గరకు వెళ్లాం. కానీ రెడ్ చిల్లీస్ సంస్థకు మాత్రం మా స్టోరీని చెప్పలేదన్నారు. మా ఐడియా వారికెలా తెలిసిందో అర్ధం కావడం లేదు… ఈ విషయమై అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశాము. స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ లో మా కథను రిజిస్టర్ చేసుకున్నం…. ఇక మా దగ్గరున్న కథలోని చాలా సన్నివేశాలు ఈ సిరీస్‌లో 10 వరకు ఒకేలా ఉన్నాయని వారు అన్నారు.