‘లుక్’ లేకపోయినా ‘లక్’ కలవడం నా అదృష్టం!

షారుఖ్‌ ఖాన్‌ ప్రస్తుతం ఏం మాట్లాడినా హైలెట్అవుతుంది… ఎందుకంటే, షారుఖ్‌ గత పది నెలలు పాటు ఒక్క సినిమా కూడా చేయడం లేదు కాబట్టి. ఈ మధ్య ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించిన రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ మాట్లాడారు… తాను ఓ నటుడ్ని కావాలని ఎప్పుడూ అనుకోలేదని… వ్యాపార రంగంలో రాణించాలనుకున్నానని చెప్పారు. థియేటర్ల కొరత వల్లే చాలా మంది సినిమా చూడలేకపోతున్నారన్నారు. అతని మొదటి చిత్రం ‘రాజు బన్‌ గయా జెంటిల్‌మ్యాన్‌ (1992).
షారుఖ్‌ మాట్లాడుతూ… ‘మొదటి సారి నన్ను నేను స్క్రీన్‌ మీద చూసుకునేటప్పుడు చాలా అంద వికారంగా ఉన్నానని అనిపించింది. నా జుట్టు చాలా ఇబ్బందికరంగా ఉండేది. నానా పటేకర్‌, అమ్రితా సింగ్‌, జుహి చావ్లా వంటి వారి ముందు విషాదకరమైన పాత్ర చేశాను. అప్పట్లో ఎయిరిండియా 25శాతం డిస్కౌంట్‌తో టిక్కెట్లు పెట్టింది. వాటినే నేను కొన్నా. ప్రొడ్యూసర్స్‌ కూడా అదే డిస్కౌంట్‌ టికెట్లు బుక్‌ చేశారు. అప్పటికీ నేనొక యాక్టర్‌ అని రియలైజ్‌ కాలేకపోయాను. మొత్తానికి జుహి, అజిజ్‌ కలసి నన్ను ఏదోలా యాక్టర్‌ని అనుకునేలా మార్చారు. నేను ఇప్పటికీ బెటర్‌ లుక్‌లో ఉండను. అప్పటి నుంచీ ఇప్పటికీ అదే లుక్‌ కొనసాగుతోంది. అయినా ప్రేక్షకులు నన్ను ఆదరించడం అనేది నా అదృష్టం. ప్రేక్షకులు నన్ను వారి మనిషిలాగే చూస్తున్నారు. ఎప్పుడూ నేను ఓ స్టార్‌ని అని ఫీల్‌ కాను’ అని చెప్పారు.
 
సినిమా టికెట్ల ధర పెంపుపై షారుఖ్‌ మాట్లాడుతూ…
‘సినిమా టికెట్ల ధర చాలా వేగంగా పెరుగుతోంది. మనలో కొందరు స్టార్స్‌ కూడా ఈ విషయాన్నే చెబుతున్నారు. నిర్మాణ వ్యయం భారీగా పెరగడమే.. సినిమా విడుదలైన మొదటి వారం ధరలు పెంచడానికి కారణం. కానీ ఈ ధరల పెంపు పై స్టార్స్‌ బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది” అని అన్నారు.
 
‘నెట్‌ఫ్లిక్స్‌’లో ‘బార్డ్‌ ఆఫ్‌ బ్లడ్‌’ నిర్మిస్తుండడంపై మాట్లాడుతూ… ‘ఇవన్నీ విభిన్నమైన వేదికలు. కానీ సినిమా అనేది రియల్‌ రొమాన్స్‌. సినిమాయే రియల్‌ సెలబ్రేషన్‌. వాస్తవం ఏమిటంటే.. థియేటర్లు విభిన్నమైన ప్రదేశాల్లో ఉంటాయి. ఇక్కడ రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా…అందులో ఒకటి. ‘సినిమా థియేటర్‌తో సంపన్నులవుతారా?’ అని ఎవరైనా నన్ను అడిగితే… ‘మనం ఒక్కరమే ఏడవలేం. మీరు ఒక్కరే నవ్వలేరు’ అని అంటాను. సినిమా థియేటర్ల నిర్హాహకులు ధనవంతులు అవుతారని అంతా బలంగా నమ్ముతున్నారు. కానీ థియేటర్ల వ్యాపారం పడిపోయినప్పుడు మాత్రం.. ‘మనం ఒక్కరమే ఏడవగలుగుతాం. నవ్వగలుగుతాం’. దేశంలో ఇంకా చాలా థియేటర్ల అవసరం ఉంది. థియేటర్ల కొరత వల్లే మూడు నుంచి 4 కోట్ల మంది సినిమాలు చూడలేకపోతున్నారు. సినిమా విడుదల రోజే 20 నుంచి 22 మిలియన్ల మంది చూసేయాలన్నది నా ఆలోచన” అని షారుఖ్‌ అన్నారు.