‘టైటానిక్’… హాలీవుడ్ చిత్రమైనప్పటికీ ప్రపంచమంతటికీ సుపరిచితమైన సినిమా. క్లాస్, మాస్ తేడా లేకుండా ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ అభిమానించారు. జేమ్స్ క్యామెరూన్ దర్శకత్వంలో లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ జంటగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 11 ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. 1912లో ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న టైటానిక్ ఓడ మంచు కొండను ఢీకొని మునిగిపోవడంతో దాదాపు 1,503 మంది ప్రయాణికులు చనిపోయిన సంగతి తెలిసిందే.మరోసారి ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని చూసే అవకాశం రాబోతోంది.ఇంతగొప్ప సినిమాకు త్వరలో సీక్వెల్ రానుంది.
ఆస్ట్రేలియాకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త క్లైవ్ పామర్ టైటానిక్‌కి సినిమా తీయాలని అనుకుంటున్నాడట. 2012లో అనుకున్నప్పటికి అది జరగలేదు. 2022 వరకు సీక్వెల్‌ని థియేటర్స్‌లోకి తీసుకురావాలని భావిస్తున్నాట. కొత్త ఓడని రూపొందించి ఇందులో 2400 మంది ప్రయాణికులని సౌథాంప్టన్ నుంచి న్యూయార్క్‌కు ప్రయాణింపజేస్తారట. కానీ ప్రపంచం మొత్తం చుట్టి వచ్చేలా తెరకెక్కిస్తారట. “ఎన్నో లక్షల మంది టైటానిక్‌లో ప్రయాణించాలని కలలు కన్నారు. వారి కలలు టైటానిక్ 2తో తీరబోతున్నాయి” అని క్లైవ్ పామర్ అన్నారు.