‘’సీత… రాముని కోసం’’ శ్రీరంగం శరత్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా సిని ప్రేక్షకులలో రోజు రోజుకి సరి కొత్త అంచనాలు సృష్టిస్తూ డిసెంబర్ రెండో వారంలో విడుదలకు ముస్తాబు అవుతుంది.
అనిల్ గోపిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శరత్ శ్రీరంగం మరియు కారుణ్య లు నటినటులుగా నటిస్తుండుగా, తస్మై చిన్మయ ప్రొడక్షన్స్ మరియు రోల్ కేమెరా యాక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగా ముద్దుల కూతురు మరియు హీరొయిన్ నిహారిక ఈ రోజు ఈ చిత్ర ఆడియో ని విడుదల చేసారు. విడుదల చేసారు.
నిహారిక మాట్లాడుతూ ‘’సీత చాలా మంచి టైటిల్, సినిమా కూడా అంత మంచి విలువలతో ఉంటదని నమ్ముతున్నాను. హారర్ సినిమాలు అంటే నాకు కొంచెం భయం. అయినా కాని అభిమానులతో పాటు నేను కూడా ఈ సినిమా ఏప్పుడేప్పుడు చూద్దామా అనే ఏదురు చూస్తున్నాను. హీరో శ్రీరంగం శరత, కారుణ్య, అనిల్ లుక్స్ బాగున్నాయి. చిత్ర యూనిట్ కి ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా అని తెలిపారు నిహారిక.
చిత్ర యూనిట్ మాట్లాడుతూ… మనిషికి, మనిషి మరణించిన తరువాత రూపాంతరం చెందే ఆత్మకు మధ్య గల ఒక బంధాన్ని ఈ సినిమాలో సరికొత్తగా అవిష్కరించాం అని తెలిపారు. వాస్తవాలు మాట్లాడుకుంటే అసలు ఆత్మలు ఉన్నాయా..? లేవా..? అవి వట్టి ఉహగానాలేనా…? మనిషి, ఆత్మ, ప్రేమ, మానవ సంబంధాలు, ఏమోషణ్ అనే అద్భుత స్క్రీన్ ప్లే తెరకెక్కిన ఈ సినిమాకు కెమెరా జై పాల్ రెడ్డి, ఆర్ట్ మధు రెబ్బ, ఏడిటింగ్ సాయి తలారి, రచన దర్శకత్వం అనిల్ గోపిరెడ్డి. విడుదల డిసెంబర్ రెండో వారం.