మన తెలుగువాడైన అనీష్ చాగంటి దర్శకత్వం వహించిన “Searching” సినిమా ప్రపంచ వ్యాప్తంగా Sony Pictures ద్వారా విడుదలై బాక్స్ ఆఫీస్ రికార్డ్ బద్దలు కొట్టి సునామీ సృష్టిస్తోంది. ఈ మధ్యే హైద్రాబాద్ లో విడుదలై ఇంకా ఆడుతోంది.మొట్టమొదటగా Sundance Film Festival లో ప్రదర్శించి ప్రఖ్యాత సినీ విమర్శకులను ఆకట్టుకుంది.నా అంచనా నిజమైతే ఈ సినిమా Oscar awards కి nominate అవడమే కాకుండా తప్పకుండా ఏదో ఒక అవార్డ్ ని గెలుచుకుంటుంది.ప్రపంచంలోని ప్రధాన websites, పత్రికలు అత్యధిక రేటింగ్ ఇవ్వడం విశేశం.కానీ,విచిత్రమేమిటంటే… ఈ సినిమా గురించి గాని, తెలుగువాడైన. అనీష్ చాగంటి గురించి… ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడా కనీసం ఒక చర్చ లేకపోవడం అటుంచి, ప్రాథమిక స్థాయిలో పబ్లిసిటీ లేకపోవడం కడు విచారకరం.ఇది ఓ అమెరికన్ థ్రిల్లర్ సినిమా, ఇక స్టోరీ లైన్ లోకి వస్తే స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్ స్క్రీన్స్ దృష్టికోణంలో కథ కొనసాగుతుంటుంది. కథనానికి ఫామిలీ డ్రామా తోడై, ఓ తండ్రి( Jhon Cho) తన పదహారేళ్ళ కూతురు ఎంతకీ ఇంటికి చేరుకోపోగా …ఆ అమ్మాయి మిస్ అయితే, డిటెక్టివ్ పోలీస్(Michelle La) సహాయంతో ఆ తండ్రి ఏవిదంగా సెర్చ్ చేసాడన్నది స్థూలంగా కథ. అనుక్షణం ఉత్కంఠను రేపే స్క్రీన్ప్లే సినిమాకి ఆయువు పట్టు. కథా, కథనాలని డ్రైవ్ చేసిన తీరు, Mood Of The Aiditorium Disturb కాకుండా ప్రేక్షకుల మైండ్ మాప్ కి కనెక్ట్ చేసిన విధానం ప్రేక్షకులని సమ్మోహనులను చేస్తుంది. కథలోని characters, ప్లాట్స్, సబ్ ప్లాట్స్ వాటంతటికి అవే ఆర్గానిక్ గా ఒకదానికొకటి పెనవేసుకొని ఓ రకమైన థ్రిల్ కి గురిచేస్తుంది. కథలో ఎక్కడ ఎమోషన్ పడిపోకుండా దాన్ని చివరి వరకు ఒడిసిపట్టుకొని నటీనటులు పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసిన తీరు ఆకట్టుకుంటుంది.దర్శకుడు హాలీవుడ్ నటీనటులతో నటనను రాబట్టిన తీరు ,తను బలంగా నమ్మిన ఎమోషన్ ని తెరకెక్కించిన విధానం నూతనత్వాన్ని సంతరించుకొని ప్రేక్షకుడిని మరోలోకంలో విహరింప చేస్తుంది. Timur BekmambetovSev, OhanianNatalie, QasabianAdam Sidman, నిర్మాతలుగా వ్యవహరించగా Aneesh Chaganty,Sev Ohanian లు స్క్రిప్ట్ రైటర్స్ గా వ్యవహరించి, Tori Borrowdale సంగీతం సమకూర్చగా Juan Sebastian Baron లు అద్భుత సినిమాటోగ్రఫీ అందించిన అరుదైన చిత్రరాజమిది -సూర్య ప్రకాష్ రాజు
# “Searching” from director Aneesh Chaganty and starring John Cho and Debra Messing, won the audience award for North American narrative film at the 34th Los Angeles Asian Pacific Film Festival.