సాత్విక ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు,వ్యాపారవేత్త మహేష్ ఖన్నా నిర్మిస్తున్న చిత్రం ‘ సత్య గ్యాంగ్’. పుష్కలమైన వినోదానికి కాస్తంత సందేశాన్ని జోడించి నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది. హీరో సాత్విక ఈశ్వర్, సీనియర్ ఆర్టిస్ట్స్ సుమన్, సుహాసినిలపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడంతోపాటు.. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తూ.. దర్శకత్వ పర్వ్యవేక్షణ చేస్తున్న మహేష్ ఖన్నా మాట్లాడుతూ.. ‘సమాజంలో అనాధలనేవారు ఉండకూడదనే సందేశానికి వినోదాన్ని మేళవించి తీస్తున్న చిత్రం ‘సత్య గ్యాంగ్’. హీరోగా పరిచయమవుతున్న సాత్విక ఈశ్వర్ కి చాలా మంచి భవిష్యత్ ఉంది. ఇంకో వారం రోజులు జరిగే షూటింగ్ తో పాటలు సహా సినిమా పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పారలెల్ గా జరుగుతోంది. త్వరలోనే ఆడియో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
సాత్విక్ ఈశ్వర్ సరసన అక్షిత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రత్యూష్, హర్షిత, సుమన్, సుహాసిని, కాలకేయ ప్రభాకర్, షఫీ, జీవా, వినోద్, మహేష్ ఖన్నా, రాజేందర్, దిల్ రమేష్, బి.హెచ్.ఈ. ఎల్.ప్రసాద్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
ప్రముఖ సీనియర్ సినిమాటోగ్రఫర్ అడుసుమిల్లి విజయ్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి కథ: సిద్ధయోగి క్రియేషన్స్, ఎడిటర్: నందమూరి హరి, అసోసియేట్ డైరెక్టర్: నాగబాబు, కో-డైరెక్టర్స్; కొండలరావు-వి.ఎన్. రెడ్డి, నిర్మాత-దర్శకత్వపర్యవేక్షణ: మహేష్ ఖన్నా, సంగీతం-దర్శకత్వం: ప్రభాస్