“సాంస్కృతిక బంధు” ‘సారిపల్లికొండలరావు ఫౌండేషన్’ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ జానపద కళాకారులకు పదివేల నగదు పురస్కారాల ప్రదానోత్సవం ఏప్రిల్ పదవతేదీన రవీంద్రభారతి సమావేశమందిరంలో ఆహూతుల హర్షధ్వానాల మధ్య అపూర్వంగా జరిగింది.కళాకారులను ఆదుకున్నప్పుడే కళలు ఫరిడవిల్లుతాయని,సారిపల్లిని స్పూర్తిగా తీసుకుని మరింతమంది ముందుకు రావాలని ముఖ్య అతిథి డా.కె.వి.రమణ అన్నారు.
కన్వీనర్ వై.కె.నాగేశ్వరరావు స్వాగతం పలుకగా, సభాధ్యక్షులు మామిడి హరికృష్ణ,ఫౌండేషన్ అధ్యక్షులు సారిపల్లి కొండలరావు,బ్రహ్మకుమారి మంజు బెహన్ గార్లు వివిధ జానపద కళలకు సంబంధించినరేగుంటల పోషం(పిల్లన గ్రోవి), శ్రీపతి పెదసాయన్న(భాగవతం), శ్రీ గట్టు చిన్నయ్య(ఒగ్గు కధ),శ్రీబట్టమేకల వీరమలు(చిరుతల రామాయణం), ఏపూరి సత్యనారాయణ(చెక్క భజన), మడిపెద్ది బుచ్చయ్య(యక్ష గానం), రామస్వామి(కోలాటం), శ్రీమతి శివమ్మ(శారద కధ), శంఖు చంద్రయ్య(బుర్రా కధ), చందు నాయక్(బంజార) గార్లకు నగదు పురస్కారాలు ప్రదానం చేశారు. భాగిశాస్త్రి ప్రార్ధన ఆలపించగా,వి.శ్రీనివాస్ గౌడ్ వందన సమర్పణ చేశారు.