‘పేపర్ బాయ్’ …సంతోష్ శోభన్ హీరోగా జయశంకర్ తెరకెక్కిస్తోన్న సినిమా . ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. రియాసుమన్, తాన్యా హోప్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ఆయనే నిర్మిస్తున్నాడు కూడా. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు.. టీజర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్ కు 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఓ ఇంజనీరింగ్ విధ్యార్థి ప్రేమలో పడిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ చిత్ర కథ. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందించారు.
నటీనటులు:
సంతోష్ శోభన్, రియా సుమన్, తాన్యాహోప్, పోసాని కృష్ణమురళి, అభిషేక్ మహర్షి, విద్యుల్లేక రామన్, జయప్రకాశ్ రెడ్డి, బిత్తిరి సత్తి, సన్నీ, మహేశ్ విట్టా తదితరులు..
టెక్నికల్ టీం:
దర్శకుడు: జయశంకర్
నిర్మాతలు: సంపత్ నంది, రాములు, వెంకట్ మరియు నరసింహా
బ్యానర్స్: సంపత్ నంది టీమ్ వర్క్స్, బిఎల్ఎన్ సినిమా అండ్ ప్రచిత్ర క్రియేషన్స్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో,సినిమాటోగ్రఫీ: సౌందర రాజన్,ఎడిటర్: తమ్మిరాజు
ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్,ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి మామిళ్ల,స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: సుధాకర్ పావులూరి
పిఆర్ఓ: వంశీ శేఖర్