సంతోష్ రాజ్, నేహాదేష్ పాండే జంటగా సీనియర్ నటుడు సుమన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘అనువంశీకత’. కౌండిన్య మూవీస్ బ్యానర్ పై తాళ్ళపెల్లి దామోదర్ గౌడ్ నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకుడు రమేష్ ముక్కెర. నిర్మాత టి.దామోదర్ గౌడ్ మాట్లాడుతూ…. మా చిత్రాని U/A సర్టిఫికెట్ వచ్చింది సెన్సార్ సభ్యులు చూసి మెచ్చుకున్నారు ఈ సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత దామోదర్ గౌడ్ తెలిపారు. దీనిని కుటుంబ కథా చిత్రంగా రూపొందించాము.
వరంగల్ లో అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరిపాము. చక్కని సందేశం ఉందని నిర్మాత తెలిపారు. ముఖ్యంగా చంద్రబోస్ రాసిన పాట ”కామన్ మ్యాన్ గా పుట్టడం.. నీ తప్పేం కాదురా బడి….” అనే పాట యూత్ ని బాగా ఆకర్షించింది.
నటుడు చిత్ర సహనిర్మాత ఆయిన మయ డి యాకూబ్ మాట్లాడుతూ… మా ‘అవంశికత’ చిత్రాన్ని చూసిన తెలంగాణ ఆసెంబ్లి స్పీకర్ మధుసూదనా చారి , కె కేశవరావు మరియ మాశ్రేయోభిలాషులు సినిమా చాల బాగుందని మెచ్చుకోవటం అనందంగావుంది. నటుడుగా ఈ చిత్రంలో మంచి పాత్ర నటించినందుకు చాల గొప్పగా ఫీలవుతున్నాను అన్నారు
ఈ చిత్రానికి సమర్పణ- శ్రీ అశ్విత, క్రాంతి కుమార్, సహనిర్మాత- ఎం.డి. యాకూబ్, కెమెరా- అడుసుమిల్లి విజయ్ కుమార్, ఫైట్స్ సతీష్, ఎడిటింగ్- డి.వి.ఎస్.ప్రభు, మేకప్- కుమార్, పాటలు-చంద్రబోస్, తైదలబాపు, కందకట్ల రామకృష్ణ, రమేష్ ముక్కెర. కథ, మాటలు, సంగీతం, దర్శకత్వం- రమేష్ ముక్కెర, నిర్మాత- తాళ్ళపెల్లి దామోదర్ గౌడ్,
నటి నటులు– పావని, చమ్మక్ చంద్ర, గీతంరాజు, ఫిష్ వెంకట్ జబర్థస్త్ రాజమౌళి, ఆనంద భారతి, తిలక్, పూజకసీకర్ (బాంబే). దామోదర్ విలన్ గా ప్రత్యేక పాత్రల్లో డా.బూరనర్సయ్య గౌడ్ (ఎం.పీ.భువనగరిరి), డా.రాకేష్ మిశ్రా (సి.సి.ఎం.బి.), డా.లింగరాజు, డా.లక్ష్మీరావు కందుకూరి తదితరులు నటిస్తున్నారు.