సంతానం, అంచల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్ ఫిలింస్ బ్యానర్‌పై రాంబాల దర్శకత్వంలో రూపొందిన `దిల్లుకు దుడ్డు` చిత్రాన్ని `శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నటరాజ్ `దమ్ముంటే సొమ్మేరా` టైటిల్‌తో అనువదించి తెలుగులో విడుదల చేస్తున్నారు. అన్ని పనులు పూర్తిచేసుకుని ఈనెల 22న రిలీజ్ అవుతుంది.
ఈ సందర్బంగా సీనియర్ పాత్రికేయుడు పసుపులేటి రామారావు మాట్లాడుతూ, ` సంతానం తమిళ్ లో హాస్య నటుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన గత సినిమాలు తెలుగులో మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు హీరోగా చేస్తోన్న సినిమా కావడంతో మంచి అంచనాలున్నాయి. ఈ నెల 22న భారీ ఎత్తున సినిమా రిలీజ్ అవుతుంది. అందరు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది` అని అన్నారు.
శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ బిజినెస్ ఎగ్జిక్యుటివ్ నరసింహారెడ్డి మాట్లాడుతూ, .` తమిళంలో తేండాల్ పిలిమ్స్ నిర్మించిన సినిమా ఇది. అక్కడ పెద్ద విజయాన్ని సాధించింది. తెలుగులో దమ్ముంటే సొమ్మేరా టైటిల్ తో అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నాం. మా బ్యానర్లో రిలీజ్ అవుతోన్న తొలి సినిమా ఇది. ఈనెల 22న రిలీజ్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు అంతా తప్పకుండా మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు.
శాన్య, కరుణాస్, శౌరభ్ భుక్లా, ఆనంద్ రాజ్, లొల్లు శోభా మనోహర్, టి.ఎమ్. కార్తిక్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్, పాటలు: మధన్, కార్కీ, సినిమాటోగ్రఫీ: దీపక్ కుమార్ పతి, ఎడిటింగ్: గోపీకృష్ణ, ఆర్ట్: ఏ.ఆర్. మోహన్, యాక్షన్: హరి దినేష్, బిజినెస్ ఎగ్జిక్యుటివ్: జె. నరసింహారెడ్డి, నిర్మాత: నటరాజ్.