సంతానం, అంచల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్ ఫిలింస్ బ్యానర్‌పై తమిళ్ రూపొందిన `దిల్లుడు దుడ్డు` చిత్రాన్ని `దమ్ముంటే సొమ్మేరా` టైటిల్‌తో తెలుగులో అనువాదం చేశారు. శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత నటరాజ్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. మే రెండవ వారం సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటివలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత నటరాజ్ మాట్లాడుతూ…. సంతానం, అంచల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్ ఫిలింస్ బ్యానర్‌పై తమిళ్ రూపొందిన `దిల్లుడు దుడ్డు` చిత్రాన్ని `దమ్ముంటే సొమ్మేరా` టైటిల్‌తో తెలుగులో రిలీజ్ చేస్తున్నాము.ఇటివల విడుదల చేసిన ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సెన్సార్ కార్యక్రమాలు పుర్తి చేసుకొని యు/ఏ సర్టిఫికెట్ తో పాటు సెన్సార్ సభ్యుల అభినందనలను పొందడంతో ఈ సినిమా పై మాకు వున్న నమ్మకం రెట్టింపుఅయ్యింది.హీరో సంతానం కు తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఉంది. తమిళంలో పెద్ద నిర్మాణ సంస్థ చేసిన ఈ సినిమా ను శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ ద్వారా మేము రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. మే రెండవ వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. తమిళ్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది అని అన్నారు.
శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నరసింహారెడ్డి మాట్లాడుతూ…. మే రెండవ వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము.స్టార్ కమెడియన్ అయిన సంతానంకు తమిల్ లోనే కాదు తెలుగు లొ కుడా మంచి గుర్తింపు వుంది. తప్పకుండా సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంది.అన్నారు.