సంతానం, అంచల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్ ఫిలింస్ బ్యానర్‌పై రూపొందిన `దిల్లుడు దుడ్డు` చిత్రాన్ని `దమ్ముంటే సొమ్మేరా` టైటిల్‌తో తెలుగులో అనువాదం చేశారు. శ్రీ కృష్ణా ఫిలింస్ బ్యానర్‌పై నటరాజ్ సినిమాను విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ ద్వితీయ వారంలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా యూనిట్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిపింది.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ “ టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. గట్స్ ఉంటే డబ్బులు సంపాదించవచ్చునని చెబుతూ ఈ సినిమా టైటిల్‌ను పెట్టారు. సంతానం మంచి నటుడు. ఆయన కు తెలుగు లో మంచి గుర్తింపు ఉంది. పైగా తమిళంలో పెద్ద నిర్మాణ సంస్థ చేసిన సినిమా శ్రీ కృష్ణా ఫిలింస్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. సినిమా విజయం సాధించి డబ్బుతో పాటు, కీర్తి ప్రతిష్టలను కూడా సంపాదించాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
శ్రీ కృష్ణా ఫిలింస్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నరసింహారెడ్డి మాట్లాడుతూ “ఏప్రిల్ రెండో వారంలో `దమ్ముంటే సొమ్మేరా` సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. తప్పకుండా సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంది“ అన్నారు. ఈ సమావేశంలో డిస్ర్టిబ్యూటర్ సత్యనారాయణ పాల్గొన్నారు.