సందీప్ కిష‌న్ ‘తెనాలి రామ‌కృష్ణ’ న‌వంబ‌ర్ 15న

సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం`తెనాలి రామ‌కృష్ణ `బీఏబీఎల్‌.`కేసులు ఇవ్వండి ప్లీజ్‌`ట్యాగ్ లైన్‌. ద‌ర్శ‌క‌త్వం: జి.నాగేశ్వ‌ర రెడ్డి. జ‌వ్వాజి రామాంజ‌నేయులు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎన్‌.ఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీష్ నిర్మించిన ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 15న విడుద‌ల చేస్తున్నారు. సినిమా టైటిల్ సాంగ్‌ను తెనాలి సంగ‌మేశ్వ‌ర సినిమా థియేట‌ర్‌లో విడుద‌ల చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ టైటిల్ సాంగ్‌ను సోష‌ల్‌మీడియాలో విడుద‌ల చేశారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన సాంగ్స్‌కి, టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. హీరోయిన్ సందీప్ కిష‌న్ లాయ‌ర్‌గా న‌టిస్తున్న ఈ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని జి.నాగేశ్వ‌రరెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. హ‌న్సిక హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది.
 
ముర‌ళీ శ‌ర్మ‌,బ్ర‌హ్మానందం,వెన్నెల‌కిశోర్‌,ప్ర‌భాస్ శ్రీను,పృథ్వి,
ర‌ఘుబాబు,స‌ప్త‌గిరి,ర‌జిత‌,కిన్నెర‌,అన్న‌పూర్ణ‌మ్మ‌,వై.విజ‌య‌
స‌త్య‌కృష్ణ న‌టీన‌టులు
 
క‌థ‌: టి.రాజ‌సింహ, సంగీతం: సాయికార్తీక్‌
సినిమాటోగ్ర‌ఫీ: సాయిశ్రీరాం,ఎడిట‌ర్‌: ఛోటా కె.ప్రసాద్‌, డైలాగ్స్‌: నివాస్, భ‌వానీ ప్ర‌సాద్‌,
స్క్రీన్‌ప్లే: రాజు, గోపాల కృష్ణ,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సీతారామ‌రాజు మ‌ల్లెల‌