సానా క్రియేషన్స్ బ్యానర్ పై సానా యాది రెడ్డి దర్శక నిర్మాతగా ‘పిట్టల దొర’ బ్యాచిలర్స్ , సంపెంగ, ప్రేమ పల్లకి, జై బజరంగభలి వంటి మూవీస్ మ్యూజికల్ గా పెద్ద సక్సెస్ సాధించాయి. 2004వ సంవత్సరం హైదరాబాద్ లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా సరి కొత్త ప్రేమకథ తో ‘నువ్వంటే నేనని’ మీ ముందుకొచ్చారు సాన యాది రెడ్డి.
దర్శక నిర్మాత సానా యాది రెడ్డి మాట్లాడుతూ – ” తెలుగు ప్రేక్షకులు పీరియాడికల్, బయోపిక్ చిత్రాలను ఆదరిస్తారని ఇటీవల సక్సెస్ సాధించిన ‘రంగ స్థలం’ ‘మహా నటి’ ‘జార్జి రెడ్డి’ ‘యాత్ర’ వంటి చిత్రాలు నిరూపించాయి. అదే స్ఫూర్తి తో నేను ఓ కథ రెడీ చేశాను. 2004 హైదరాబాద్ లో జరిగిన ఓ యదార్ధ సంఘటనల ఆధారంగా రాసుకున్నసరి కొత్త ప్రేమకథను తెరకెక్కిచాను. వరికుప్పల యాదగిరిని పాటల రచయితగా నా చిత్రాల ద్వారానే పరిచయం చేశాను. ఇప్పుడు ఈ చిత్రంతో అతన్ని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నాను. ఈ సినిమాకి అతని పాటలు ఓ హైలెట్ గా నిలుస్తాయి. గత ఏడాది షూటింగ్ పార్ట్ పూర్తి చేసి, ఈ ఏడాది జనవరి లో మా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ కాపీ రెడీ చేసాం. కరోనా మహమ్మారితో లాక్ డౌన్ పెట్టడంతో .. థియేటర్లు, మల్టి ఫ్లెక్సులు ఈ ఏడాది ఆఖరు వరకు కూడా తెరిచే అవకాశం లేదు కనుక .. మా సినిమాని నేరుగా ఇంట్లోనే కుటుంబ సమేతంగా చూసే విధంగా ఓ టి టి ద్వారా విడుదల చేయాలనీ భావించాను. నా గత చిత్రాలను ఆదరించారు అదే విధంగా ‘నువ్వంటే నేనని’ ని కూడా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను”అన్నారు.
నకుల్, శ్వేతా (నూతన పరిచయం) చంద్ర మోహన్, దువ్వాసి మోహన్, ‘చిత్రం’ శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ : పరమేష్ – రామ్ కుమార్, మాటలు: పోలూరు ఘటికా చలం
కెమెరామెన్: విజయ్. సి .కుమార్, పాటలు, సంగీతం : వరికుప్పల యాదగిరి, ఎడిటర్: రమేష్, డాన్స్ : స్వర్ణ – దివ్య, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్
నిర్మాత : సానా భాగ్య లక్ష్మి,కాన్సెప్ట్ , స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సానా యాదిరెడ్డి