సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే ఈసారి టీఆర్ఎస్ తరుపున టాలీవుడ్ ప్రముఖ నటి సమంత పోటీ చేయబోతున్నారని తాజాగా వార్తలు వ్యాపించాయి. క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్న ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఈసారి సమంతను పోటీ చేయించాలని మంత్రి కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త బయటికి రావడంతో.. త్వరలోనే సమంత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా నడుస్తోంది.
ఇక్కడగతంలో కాంగ్రెస్ పార్టీ తరపున జయసుధ పోటీ చేసింది. జయసుధ కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్. అందుకే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఆమెను సికింద్రాబాద్ తరుపున పోటీ చేయించి.. గెలిపించుకుంది. ఇప్పుడదే లెక్క వేస్తూ.. క్రిస్టియన్ అయిన సమంత అయితే సినీ స్టార్ ఇమేజ్, సీమాంధ్ర ఓటర్ల ప్రభావం, క్రిస్టియన్ ఓట్స్ ప్రభావం అన్నీ కలగలిపి ఈజీగా సమంత గెలిచేస్తుందనే భావనతో ఆమెకు ఈ సీట్‌ని కేటీఆర్ కేటాయించారట. అందుకే సమంతకు తెలంగాణ తరఫు నుండి గౌరవ మర్యాదలు అందేలా టీఆర్ఎస్ చూస్తుందని, బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు ఇస్తుందని కూడా అనుకుంటున్నారు. అయితే ఈ విషయంపై సమంతకానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం తరుపు నుంచి గానీ ఎటువంటి వార్తలు బయటికి రాలేదు.
తెలుగు, తమిళం భాషల ఫీమేల్ సెంట్రిక్ మూవీలో …
పెళ్లి తర్వాత తన సినిమాల స్పీడ్‌ను మరింత పెంచింది అక్కినేని వారి కోడలు సమంత. తాజాగా సామ్ చేయబోతున్న ఓ ఫీమేల్ సెంట్రిక్ మూవీలో మరో ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ కూడా సందడి చేయబోతున్నారట. సమంత ఏరికోరి ఇప్పుడో ఫీమేల్ సెంట్రిక్ మూవీలో నటించబోతుంది. ఆ చిత్రమే కన్నడలో సూపర్ హిట్టైన ‘యు-టర్న్’. 2016లో కన్నడ భాషలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా విడుదలైన ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ లీడ్ రోల్ పోషించింది. ఇప్పుడు ఆ పాత్రనే తెలుగు, తమిళం భాషల్లో సమంత చేయబోతుంది. ఇక ఈ చిత్రంలో మరో రెండు కీలక పాత్రల్లో సీనియర్ హీరోయిన్స్ శ్రియ, భూమిక నటించబోతున్నారట.
సమంత రీమేక్ మూవీకి ఒరిజినల్ కన్నడ వెర్షన్ ‘యు-టర్న్’ డైరెక్టర్ పవన్ కుమారే దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే సమంత లవర్ రోల్‌కు రాహుల్ రవీంద్రన్.. కీలకమైన పోలీస్ పాత్రకు ఆది పినిశెట్టి ఎంపికయ్యారు. ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లబోతుంది. మొత్తం మీద ఇటు తెలుగులో ‘రంగస్థలం’, ‘మహానటి’ చిత్రాలు అటు తమిళంలో విశాల్ ‘ఇరుంబు తిరై’, విజయ్ సేతుపతి ‘సూపర్ డీలక్స్’ చిత్రాలలో నటిస్తోన్న సమంత.. ఇప్పుడు ఒకేసారి తెలుగు, తమిళం భాషల్లో ‘యు-టర్న్’ సినిమా చేయబోతుందన్నమాట. మరి సామ్‌కు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.