సమంత అక్కినేని టాప్ లో ఉన్నపుడు వరసగా భారీ సినిమాలు వచ్చాయి. దర్శకులు సమంత కోసం కథలు రాసుకున్నారు. 2011 దూకుడు నుంచి 2018 వరకు కూడా సమంతకు గోల్డెన్ పీరియడ్ నడిచింది. ఆ సమయంలో ఆమె ఎన్ని సినిమాలు చేసిందో.. అంతకంటే ఎక్కువ సినిమాలు వదిలేసింది కూడా. కొన్ని కథలు నచ్చక.. మరికొన్ని డేట్స్ కుదరక వదిలేసుకుంది. అలా సమంత వదిలేసిన 10 సినిమాల్లో దాదాపు 8 వరకు ఫ్లాప్ అయ్యాయి…
మణిరత్నం ‘కడలి’ : అప్పట్లో ఈ సినిమాకు డేట్స్ ఇచ్చి మరీ తర్వాత వదిలేసింది సమంత.
రామ్ చరణ్ ‘ఎవడు’ : స్కిన్ ఎలర్జీ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకుంది అక్కినేని కోడలు.
విక్రమ్ ‘ఐ’ : ఈ సినిమాకు కూడా డేట్స్ ఇచ్చిన తర్వాత స్కిన్ ప్రాబ్లమ్ తోనే నో చెప్పింది.
రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ : అదే సమయంలో మరో రెండు సినిమాలు ఉన్న కారణంగా బ్రూస్లీకి డేట్స్
ఇవ్వలేకపోయింది స్యామ్.
నాని ‘నిన్ను కోరి’ : కథ నచ్చినా అప్పటికి ఉన్న కొన్ని కారణాలతో నిన్ను కోరిలో సమంతను చూడలేకపోయాం.
‘యూ టర్న్’ (హిందీ రీమేక్) : ఇక్కడ ఫలితం తేడా వచ్చేసరికి హిందీపై ఆసక్తి చూపించలేదు సమంత.
‘ఎన్టీఆర్’ కథానాయకుడు (ఓ పాత హీరోయిన్ పాత్ర కోసం అడిగారు) : మరీ చిన్న పాత్ర కావడంతో ఆసక్తి చూపించలేదు స్యామ్.
కరణ్ జోహార్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ : బాలీవుడ్ తనకు సూట్ కాదని.. అక్కడ వాళ్లను తనను ఏలియన్లా చూస్తారంటూ సెటైర్ వేసుకుంది సమంత అక్కినేని.
అశ్విన్ శరవణన్ సినిమా : పెళ్లి సందర్భంలో వచ్చిన ఆఫర్ కావడంతో దీనికి నో చెప్పింది సమంత.
సుకుమార్ ‘పుష్ప’ : ‘రంగస్థలం’ తర్వాత మరో ఆఫర్ ఇచ్చినా ఎందుకో కానీ సమంత పుష్పకు నో చెప్పింది
గుణశేఖర్ శశకుంతల గా సమంత… సమంత నటించనున్న తొలి పీరియాడికల్ చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ఆరంభం కానుంది. దుష్యంతుడు–శాకుంతల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు గుణశేఖర్. శకుంతల పాత్రలో సమంత కనిపిస్తారు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ సినిమా నిర్మిస్తారు. మార్చి 20న హైదరాబాద్‌లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం భారీ సెట్స్‌ను నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రలో ఓ మలయాళ నటుడు కనిపిస్తారని టాక్. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు.