సమంత ఇటీవల చేసిన చిత్రం ‘రంగస్థలం’. రామలక్ష్మి పాత్రలో ఒదిగిపోయింది. మేకప్ లేకుండా చేసిన ఈ పాత్రకు మంచి ప్రశంసలు లభిస్తున్నారు. తన భర్త నాగచైతన్యతో విహార యాత్ర నిమిత్తం వెళ్లిన ఆమె అమెరికాలో ఉంది.ఈ సందర్భం గా అభిమానులతో సమంత ట్విట్టర్ లో చిట్‌చాట్ చేసింది. ఇటీవల తనను నటనతో ఇంప్రెస్ చేసిన నటి సాయి పల్లవి అని సమంత ప్రశంసించడం విశేషం…
‘రంగస్థలం’ విజయంతో మీరు ఎంత సంతోషంగా ఉన్నారు?
నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతీ పాత్ర ప్రత్యేకమే. ఈ ప్రయాణం ఫలితాల మీద ఆధారపడదు.
‘రంగస్థలం’ సినిమాకు మీకు వచ్చిన ఉత్తమ ప్రశంస ఏది?
సినిమా విడుదలైన రోజు నుంచీ ట్వీట్లు ఆగడం లేదు. అది బెస్ట్ ఫీలింగ్. ప్రతి కొన్ని సెకన్లకు నా ట్విటర్లో మెసేజ్ లు రిఫ్రెష్ చేస్తున్నా ట్వీట్లు వరుసగా వస్తూనే ఉన్నాయి.
రామ్ చరణ్‌తో కలిసి పనిచేయడం ఎలా ఉంది?
ది బెస్ట్. ఆయన చాలా ప్రియమైన, సౌమ్యమైన వ్యక్తి.
‘అదృష్టవంతులు. అందుకే పెద్ద అవకాశాలు వస్తున్నాయి’ అని ప్రజలు అంటే మీ స్పందన ఏంటి?
అదృష్టం కాస్త కావాలి. కానీ అలా అన్నింట్లో ఎన్ని రోజులు కేవలం అదృష్టంతోనే ముందుకు వెళ్తారు?
అక్కినేని చైతన్యలో మీకు బాగా నచ్చిన విషయం?
చై అక్కినేని కావడం.
ఎందుకు ‘రంగస్థలం’ థ్యాంక్స్ మీట్‌కు రాలేదు?
విహారయాత్రలో ఉన్నా.
మీ విహారయాత్ర ఎలా జరుగుతోంది?
ఈ విరామం చాలా అవసరం.
మీరు జీవితంలో తీసుకున్న గొప్ప నిర్ణయం ఏమిటి?
నేను తీసుకునే ప్రతి నిర్ణయం గొప్పదిగానే భావిస్తా.
మీ జీవితంలో గుర్తుండిపోయే రోజు ఏమిటి?
నా వివాహం రోజు.
ఉపాసన, రామ్ చరణ్ గురించి ఒక పదంలో చెప్పండి?
సరైన జోడి.
తన పెర్ఫార్మెన్స్తో ఇటీవల మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన నటి లేదా నటుడు ఎవరు?
సాయి పల్లవి.