ఇటీవల సినిమావారు నటనకే పరిమితం కాకుండా తమకి అభిరుచి ఉన్న రంగాల్లో రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా మంది ఇప్పటికే చిత్ర నిర్మాణం, స్పోర్ట్స్, వస్త్ర రంగం, ఫ్యాషన్ రంగం.. ఇలా పలు రకాల రంగాల్లో ప్రయత్నం చేస్తున్నారు. వారి లానే నటి సమంత సైతం త్వరలోనే వస్త్ర రంగంలోకి అడుగు పెట్ట బోతోంది. ఓ పక్క సినిమాలతో మరో పక్క అభిరుచిగల రంగాల్లో రాణించేందుకు సమంత కృషి చేస్తోందని వేరే చెప్పక్కర్లేదు. నేటి తరం మహిళలకు సౌకర్యవంతంగా ఉండే దుస్తుల రూపకల్పనతో ‘సాకి వరల్డ్’ పేరుతో ఓ బిజినెస్‌ని ఆరంభించబోతోంది. ఫ్యాషన్‌పై తనకి ఉన్న ప్రేమ, మక్కువని అన్నింటికి మించి తన ప్యాషన్.. కలలు చూపేలా ‘సాకి వరల్డ్’ ఉండబోతోందని, సాకీ వరల్డ్‌లో ధరలు సామాన్యులకి అందుబాటులో ఉంటాయని… మీరందరూ ఇష్టపడతారని.. ట్విట్టర్ వేదికగా సమంత తెలిపింది. అలాగే ‘సాకి వరల్డ్’ కోసం తాను ఏం చేస్తుంది?, దీని లక్ష్యం ఏమిటి? మహిళలకు ఎలా అందుబాటులోకి తీసుకురాబోతున్నారనే విషయాలతో ఉన్న ఓ వీడియోని సైతం సమంత షేర్ చేసింది..
ఇదిలా ఉంటే, సమంత ఇప్పటికే తన స్నేహితులతో కలిసి ‘ఏకమ్’ అనే చిన్న పిల్లల స్కూల్ కూడా ఓపెన్ చేసింది.. ప్రస్తుతం సమంత తెలుగు, తమిళ సినిమాలతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ‘ది ఫ్యామిలీ మ్యాన్2’ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్‌లో సమంత నటిస్తోంది. ఇందులో ఆమె టెర్రరిస్టుగా నెగటివ్ టచ్ తో కూడిన పాత్రలో నటిస్తోంది. ఇది త్వరలోనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది.
కష్టపడి పని చేయడానికి ఇన్స్పిరేషన్…
ఇంతకు ముందు ఓడిపోతాం అనే భయంతో కష్టపడేదాన్ని. కానీ కరోనా వల్ల నా ఆలోచనా ధోరణి మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే నాకు సంతోషాన్ని ఇస్తాయి అనే విషయాలకు మాత్రమే కష్టపడాలనుకుని నిర్ణయించుకున్నాను. సంతోషంగా ఉండాలనే ఆలోచన నన్ను మోటివేట్ చేసేస్తుంది. కష్టపడేలా చేస్తుంది. ప్రస్తుతం అందరం కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. కొందరైతే చాలా కష్టాల్లో ఉన్నారు. ఈ కష్టకాలం త్వరగా గడచిపోవాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను…అని చెప్పింది సమంత.