‘ఓబేబీ’ చిత్రవిజయం సమంత జీవిత నిర్ణయాన్నే మార్చుకునేలా చేసింది. ఈ విషయాన్ని సమంతనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది.కళాకారులకు జీవితంలో గుర్తుండిపోయే చిత్రాలంటూ కొన్ని ఉంటాయి. నటి సమంత జీవితంలో మరచిపోలేని చిత్రం ‘ఏం మాయచేసావే’. ఈ చిత్రం ఆమెకు నటిగా సుస్థిరత స్థానాన్ని కల్పించడంతో పాటు, తనకు జీవిత భాగస్వామినే అందించింది. ఆ తరువాత తమిళం, తెలుగు భాషల్లో పలు కమర్షియల్ చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా ఆమె నటించిన ‘ఓబేబీ’ చిత్రం సమంతను మరో స్థాయికి తీసుకెళ్లింది. హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల నాయకి స్థాయికి వెళ్ళింది. అనుష్కకు ఓ ‘అరుంధతి’, నయనతారకు ఓ ‘మాయ’, ‘అరమ్’ చిత్రాల లాగా సమంతకు ఓ బేబీ మైలురాయిగా నిలిచి పోతుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ చిత్రం సమంత జీవితానికి సంబంధించిన నిర్ణయాన్నే మార్చుకునేలా చేసింది. ఈ విషయాన్ని సమంతనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది….’ అనుష్క నటించిన ‘భాగమతి’ చిత్రం తరువాత అమెరికాలో ఒక మిలియన్ డాలర్లు వసూళ్లు సాధించిన చిత్రం ‘ఓ బేబీ’నే’నని పేర్కొంది. ‘అందుకే తాను బిడ్డకు తల్లి కావాలన్న తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న’ట్లు పేర్కొంది.
సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఆ తరువాత కూడా కథానాయకిగా తన క్రేజ్‌ను ఏ మాత్రం తగ్గకుండా కాపాడుకుంటూ వస్తోంది. తరుచూ గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ వార్తల్లో ఉంటోంది. కాగా ‘ఓ బేబీ’ చిత్రం తరువాత సమంత తమిళ చిత్రం ’96’ రీమేక్‌లో నటిస్తోంది. ఈ చిత్రం తరువాత సమంత వచ్చే ఏడాది తల్లి కావాలని నిర్ణయించుకుందనే ప్రచారం జరుగుతోంది. కాగా ఆ ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టేలా సమంత తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది. ’96’ చిత్రం తరువాత తాను నటించనున్న కొత్త చిత్ర వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని తెలిపింది. నటి అనుష్క నటించిన ‘భాగమతి’ చిత్రం తరువాత అమెరికాలో ఒక మిలియన్ డాలర్లు వసూళ్లు సాధించిన చిత్రం ‘ఓ బేబీ’నేనని పేర్కొంది. అందుకే తాను బిడ్డకు తల్లి కావాలన్న తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు పేర్కొంది. అదేవిధంగా ఇకపై సమంత కథానాయిక ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే అంగీకరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొత్తం మీద ‘ఓ బేబీ’ చిత్రం తన జీవితాన్నే మార్చేసింది.
ఏకంగా మూడుకోట్లకు పెంచేసిందట !
నయనతార, కాజల్‌అగర్వాల్ వంటి తారలే వివాహం అయితే మార్కెట్ తగ్గిపోతుందనే భయంతో పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారు. సమంత మాత్రం ధైర్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తున్నారు.నటి సమంత నటించిన తాజా చిత్రం ‘ఓ బేబీ’. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా సమంతకు తొలి సక్సెస్‌ను ఇచ్చిన చిత్రం ఇదే అవుతుంది. ఇంతకు ముందు ‘యూటర్న్’ చిత్రంలో అలాంటి పాత్రను పోషించినా, అది ఆశించినంతగా సక్సెస్ కాలేదు. అంతకుముందు తన భర్త నాగచైతన్యతో నటించిన ‘మజిలి’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.దాంతో సమంత పారితోషికాన్ని అమాంతం పెంచేశారట. బాలీవుడ్‌ను పక్కన పెడితే ఇప్పటి వరకూ దక్షిణాదిలో అత్యధిక పారితోషికాన్ని తీసుకుంటున్న నటిగా నయనతార నిలిచారు. ఈ అమ్మడు చిత్రానికి అక్షరాలా రూ.5 కోట్లు పుచ్చుకుంటున్నారని సమాచారం.ఆ తరువాత అధిక పారితోషికం తీసుకుంటున్న లిస్ట్‌లో నటి అనుష్క నిలిచారు. ఈ బ్యూటీ రూ.4 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్లు టాక్. కాగా సమంత ఇప్పటి వరకూ రూ.2 కోట్లు పారితోషికాన్ని తీసుకుంటోందని, దాన్ని ‘ఓ బేబీ’ హిట్ తరువాత ఏకంగా రూ.3 కోట్లకు పెంచేసిందని సినీ వర్గాల్లో టాక్ .