సుదీప్‌కు కారు కానుక ఇచ్చిన సల్మాన్

‘దబాంగ్‌ 3’లో విలన్‌ గా నటించి ప్రశంసలందుకున్న సుదీప్‌కు సల్మాన్‌ రూ.1.55 కోట్లు విలువైన బీఎండబ్ల్యూ ఎం5 కారును కానుకగా ఇచ్చాడు. సల్మాన్‌ఖాన్‌ నటించిన ‘దబాంగ్‌ 3’ చిత్రం బాక్సాపీస్‌ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోన్న సంగతి తెలిసిందే. సోనాక్షిసిన్హా, సయీ మంజ్రేకర్‌, సల్మాన్‌ ఖాన్‌ కాంబినేషన్‌ లో వచ్చిన ‘దబాంగ్‌ 3’ చిత్రం ఇప్పటివరకు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్‌ చేస్తోన్న సల్లూభాయ్‌ కిచ్చాసుదీప్‌కు విలువైన బహుమతిని అందజేశాడు.తన కోస్టార్స్‌కు సల్మాన్‌ అప్పడపుడు కానుకలిస్తుంటాడనే విషయం తెలిసిందే.
 
“మీరు మంచి చేస్తే ఎప్పడూ మీకు కూడా మంచే జరుగుతుంది. సల్మాన్‌ బీఎండబ్ల్యూ 5తో నా ఇంటి దగ్గర ల్యాండింగ్‌ అయి సర్‌ఫ్రైజ్‌ ఇచ్చాడు. నాపైన, నా కుటుంబసభ్యుల మీద చూపిస్తున్న మీ ప్రేమకు ధన్యవాదాలు సర్‌. మీతో కలిసి పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా”..అని ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో.. సల్మాన్‌ తో కారులో ఉన్న ఫొటోలను సుదీప్‌షేర్‌ చేశాడు.