సాయికిరణ్ అడివి ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ అక్టోబర్ 18న

సాయికిరణ్ అడివి దర్శకత్వంలో… ఆది సాయికుమార్ కథానాయకుడిగా.. ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా చేసిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ . ‘వినాయకుడు’, ‘విలేజ్ లో వినాయకుడు’, ‘కేరింత’ చిత్రాల దర్శకుడు సాయికిరణ్ అడివి.. కాశ్మీర్ పండిట్ల సమస్యలతో, తీవ్రవాదం నేపథ్యంలో ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ తెరకెక్కించి అక్టోబర్ 18న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
 
సాయికిరణ్ అడివి మాట్లాడుతూ… “వాస్తవ ఘ‌ట‌న‌లనేపధ్యం లో క‌ల్పిత కధతో చేసిన చిత్రమిది. ఎన్.ఎస్.జి కమాండోగా ఆది సాయికుమార్, ఘాజీ బాబా గా అబ్బూరి రవి, ఫరూఖ్ ఇక్బాల్ ఇరాఖీగా మనోజ్ నందం చేసారు. శ‌షా చెట్రి, కృష్ణుడు, నిత్యా నరేష్, పార్వతీశం, కార్తీక్ రాజు అద్భుతంగా నటించారు. శ్రీచరణ్ పాకాల చక్కటి పాటలు..నేపథ్య సంగీతాన్ని అందించాడు. దేశభక్తి గీతాన్ని పాడిన కీరవాణిగారికి కృతజ్ఞతలు. ఆ పాటను రామజోగయ్య శాస్త్రి గారు అందించారు. సెన్సార్ సభ్యులు సినిమా బావుందని మెచ్చుకున్నారు ” అన్నారు.
 
ఆది సాయికుమార్ మాట్లాడుతూ… “తొలిసారి ఎన్.ఎస్.జి కమాండోగా నటించాను. నా లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంతో పరిశోధన చేసి సాయికిరణ్ అడివి గారు సినిమా తీశారు” అన్నారు.
 
‘ఎయిర్ టెల్’ మోడ‌ల్ శ‌షా చెట్రి, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ ఈ చిత్రంలోనటీనటులు. కట్ట ఆశిష్ రెడ్డి,ప్రతిభా అడివి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల… ఆర్టిస్ట్స్ , టెక్నీషియన్స్ నిర్మాత‌లు. యూనిట్ స‌భ్యులంతా క‌లిసి ఓ సినిమా నిర్మాణంలో భాగ‌మ‌వ‌డం ఇదే మొదటిసారి.
 
బ్యాన‌ర్‌: వినాయ‌కుడు టాకీస్‌
సినిమాటోగ్ర‌ఫీ: జైపాల్ రెడ్డి నిమ్మ‌ల‌,ఎడిట‌ర్‌: గ్యారీ .బిహెచ్‌
స్క్రిప్ట్ డిజైన్‌: అబ్బూరి ర‌వి,ద‌ర్శ‌క‌త్వం: సాయికిర‌ణ్ అడివి