” నేను ఓ సన్నివేశం చేయాల్సి వచ్చినప్పుడు ప్రతిదాన్నీ మరిచిపోయి ఖాళీగా సెట్స్‌పైకి వెళతా. నా చుట్టూ ఏం జరుగుతుంది. నన్ను ఎవరు చూస్తున్నారన్న విషయాలను పట్టించుకోను. నేను, నేను చేయాల్సిన పాత్ర మాత్రమే అక్కడ ఉంటాయి” అని కథానాయిక సాయి పల్లవి చెప్పింది. మలయాళ చిత్రం ‘ప్రేమమ్’లో అందమైన టీచర్‌గా మొదలు పెట్టిన ఈమె కెరీర్ ‘మారి 2’ వరకూ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. తన నటనకు మంచి మార్కులే పడుతున్నాయి. కానీ ఆమె తనకు నటించడం ఎలాగో తెలియదని చెబుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయి పల్లవి యాక్టింగ్ గురించి తనకు ఏమీ తెలియదని పేర్కొంది.
”కొందరు నటులు మెథాడికల్గానూ, మరికొందరు స్ఫూర్తివంతంగానూ నటిస్తారు. కానీ నాలో ఆ రెండూ ఉంటాయి. అదెలాగో నాకూ తెలియదు. నిజం చెప్పాలంటే నటించడం అంటే తెలియదు. మా దర్శకుడు ఏం చెబుతాడో? అదే చేసుకుంటూ పోతా? అంతే. సీన్ చేసేటప్పుడు ప్రవర్తన, స్పందనను గమనించి కొంత వరకూ నేర్చుకుంటా” అని చెప్పింది పల్లవి. ఏదైనా సినిమాలో పాత్రను తను తాను ఓన్ చేసుకున్నాకే నటించడం మొదలుపెడుతుందట. మొదటి చిత్రం ‘ప్రేమమ్’లోని మలార్ పాత్ర మాత్రం నిత్యం తనకు స్ఫూర్తిగా నిలుస్తుందట.తమిళ స్టార్ సూర్య భార్యగా సాయిపల్లవి నటించిన ‘ఎన్జీకే’ సినిమా ఇటీవల విడుదలయ్యింది
నన్ను నన్నుగా స్వీకరించాలనే !
ఆత్మస్థైర్యమే నిజమైన అందమని కథానాయిక సాయిపల్లవి అన్నారు. ఈమె మేకప్ వేసుకోవడానికి ఆసక్తి చూపరు. దాదాపు అన్నీ సినిమాల్లోనూ మేకప్ లేకుండా సహజంగా నటించారు. ఒకానొక సమయంలో ముఖంపై మొటిమలతో ఆమె నటించడం పట్ల కామెంట్లు కూడా వచ్చాయి. ఇలా నిజ జీవితంలో ఉండే లుక్‌తోనే కెమెరా ముందు నటించడం గురించి సాయిపల్లవి తాజాగా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. మొటిమలతో వెండితెరపై కనిపించడానికి ఎప్పుడూ ఇబ్బంది పడలేదని అన్నారు. ‘నన్ను నన్నుగా ప్రజలు స్వీకరించాలి. మొటిమలు ఉన్న అమ్మాయి అయినా వారికి నచ్చాలి. ఆత్మస్థైర్యం నిజమైన అందం అనేది నా అభిప్రాయం’ అని తెలిపారు.