మలయాళంలో `ప్రేమమ్`లో మలర్ పాత్రలో నటించి కేరళను కట్టి పడేసింది సాయి పల్లవి. ఇప్పుడు తాజాగా తెలుగులో `ఫిదా`లో నటించింది. ఆమె హీరోయిన్ గా ఎంసీఏ రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ నుంచి వచ్చి ప్రెస్ మీట్లో పాల్లొన్నారు సాయి పల్లవి. ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడారు..
* ఈ సినిమా కోసం వర్క్ షాప్‌లో పాల్గొన్నారా?
– అవునండీ. నేను మలయాళ సినిమా కోసం కూడా వర్క్ షాప్ చేయలేదు. కానీ ఈ సినిమాకు చేశాను. ఇందులో నా డైలాగులు ఇంపార్డెంట్. అందుకే హెల్దీ డిస్కషన్స్ చేసుకునేవాళ్లం.
* ఫస్ట్ డైలాగే బొక్కలిరగ్గొడతా అని అన్నారు..
– నేను రియల్ లైఫ్‌లో చాలా సాఫ్ట్ అండీ. బూతులు మాట్లాడను. కానీ ఈ సినిమా కోసం డైరక్టర్‌గారు ఏం చెబితే అదే చేశాను.
* తెలంగాణ శ్లాంగ్ను అంత తేలిగ్గా ఎలా పట్టుకోగలిగారు?
– మా దర్శకుడు, డైరక్షన్ డిపార్ట్ మెంట్ వాళ్లంతా కలిసి నేర్పించారు. ఈజీగా నేర్చుకోగలిగాను అని అన్నారు.
* ఈ సినిమా కోసం ఏమి నేర్చుకున్నారు?
– ట్రాక్టర్ తోలడం నేర్చుకున్నా. చాలా కష్టం ఆ పని చేయడం.. ఎలా చేస్తారో పాపం.. అలాగే నాట్లు నాటడం కూడా బాగా వచ్చింది.
* మలయాళ ప్రేమమ్‌ను తెలుగులో మీరే చేస్తారని అన్నారే?
– నా వరకు వచ్చి ఎవరూ అనలేదండీ.. కానీ నేను ఆ పాత్రను మరలా చేయనని చెప్పేశాను.ఇప్పుడు ఫిదాలో భానుమతి పాత్రను కూడా మరలా చేయమని ఎవరైనా అడిగితే చేయనేమో.. ఆలోచిస్తానేమో..
* అంటే రీమేక్స్ మీరు చేయరా?
– అలాగని నేను అనడం లేదు. నేను రీమేక్‌కి వ్యతిరేకం కాదు. . కాకపోతే అవి నన్ను అంతగా ఎగ్జయిట్ చేయలేవేమోనని నా ఫీలింగ్.
* ఒకసారి ఒక్క సినిమానే చేస్తానని రూల్ పెట్టుకున్నారట కదా?
– అంటే ఫోకస్ బాగా కుదురుతుందని అలా అనుకున్నానండీ.. కాకపోతే ప్రస్తుతం మాత్రం రెండు సినిమాలు చేస్తున్నా. ఒకటి తెలుగులో, మరొకటి తమిళ్లో.
* తమిళ్లో మీకు ఫేవరెట్ హీరోలు ఎవరు?
– నేను తమిళమ్మాయి కాబట్టి రజనీసార్, కమల్‌సార్ అంటే ఇష్టం. నాకు `కాక్క కాక్క` సమయం నుంచి సూర్య అంటే ఇష్టం. జ్యోతికగారి నటనంటే చాలా ఇష్టం.
* డాక్టర్ చదువులు ఎంత వరకు వచ్చాయి?
– చదువు పూర్తయింది. జార్జియాలో చేశాను. ఇక్కడుంటే సినిమాల కోసం వెళ్తానని నన్ను జార్జియా పంపించి చదివించారు. కార్డియాలజీ చదవాలని ఉంది. సినిమాలు చాలు అనుకున్నప్పుడు నేను డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తాను.
* మీరు బేసిగ్గా డ్యాన్సర్. ఈ సినిమాలో చాలినన్ని పాటలు లేవని బాధపడ్డారా?
– సినిమాకు ఎన్ని పాటలు కావాలో శేఖర్‌గారు అన్నీ పెట్టేశారండీ. బతుకమ్మకి సంబంధించి మరో డ్యాన్స్ కూడా ఉంటుంది . దాన్ని త్వరలోనే యాడ్ చేస్తారు.
* వరుణ్ తేజ్‌తో ఎలా కెమిస్ట్రీ వర్కవుట్ అయింది?
– ఆయన కోసం పే..ద్ద హీల్స్ వేసుకున్నా. నేను 5.4, ఆయనేమో 6.4 అయినా మా జంట బానే ఉందని చాలా మంది చెప్పారు. వరుణ్ చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. చాలా కామ్‌గా ఉంటారు. ఏ సన్నివేశానికి ఎంత కావాలో అంత నటించడం అతనికి చాలా బాగా తెలుసు.
* పవన్ కల్యాణ్‌కి ఫ్యానా మీరు?
– ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ని. ఆయనలా చేయగానే అందరూ క్లాప్స్ కొట్టారు. నా నటన నచ్చి కొడుతున్నారా? లేక వాళ్లకు నచ్చిన పవన్ కల్యాణ్ అనే పేరు వినగానే చప్పట్లు కొట్టారా అని నాకు అర్థం కాలేదు. సో కాసింత టెన్షన్ పడ్డాను.
* గట్టిగా అనుకుంటే అవుతుంది.. అనుకో అంటారుగా.. మీరు ఎప్పుడైనా అనుకున్నారా?
– అనుకుంటే అవుతుందనే నమ్మకం నాలో ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే ఎవరికైనా కాసింత ఓపిక కావాలి. అంతే.