‘‘ఈ సమయంలో నా డాక్టర్ చదువు ఉపయోగపడలేదే అని చాలా బాధపడ్డాను” అని అంటోంది సాయి పల్లవి. “కోవిడ్ నుంచి మనల్ని రక్షించడానికి చాలామంది శ్రమిస్తున్నారు. అందులో డాక్టర్లు కూడా ఉన్నారు ’’అని చెప్పింది. యాక్టింగ్‌తో పాటు సాయి పల్లవి దగ్గర మెడిసిన్ చదువు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆ మధ్య లాక్డౌన్లో మెడిసిన్‌కి సంబంధించిన ఓ పరీక్ష రాయడానికి కూడా వెళ్ళింది ఆమె.
దాని గురించి సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘నేను చదివిన మెడిసిన్ మొత్తాన్ని మర్చిపోతున్నాను’ అని లాక్డౌన్లో అర్థం అయింది. నాలుగేళ్ల నుంచి పుస్తకాలే పట్టుకోలేదు. ఆరేళ్లు కష్టపడి చదివింది ఇలా వృథా కావడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే లాక్డౌన్లో మళ్లీ చదవడం మొదలెట్టాను. లాక్డౌన్లో నేను రాసిన పరీక్ష.. ముందే రాసి ఉంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైద్య సేవలకు ఏదో విధంగా ఉపయోగపడేదాన్ని. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడలేదే అని చాలా బాధగా ఉంది’’ అని అంది సాయిపల్లవి.
అద్భుతమైన నటి.. డ్యాన్సర్.. ‘ఫిదా’తో తెలుగులో సంచలన సక్సెస్ ఇచ్చింది సాయి పల్లవి. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అతి తక్కువ సమయంలోనే.. చేసింది కొన్ని సినిమాలే అయినా..ఆమె క్రేజ్ అనూహ్యంగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఆమె కెరీర్ ఒక్కసారిగా స్లో అయిపోయింది. ‘పడిపడి లేచే మనసు’, ‘ఎన్జికే’, ‘మారి 2’ ఫ్లాప్ అయ్యాయి. అయినా ఈమెకు అవకాశాలు తగ్గ లేదు.వరసగా ఇప్పటికీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. తెలుగు, తమిళంతో పాటు మలయాళంలో కూడా ఈమెకు ఆఫర్స్ వస్తున్నాయి. ఇన్ని ప్లాపుల తర్వాత కూడా రెమ్యునరేషన్ పెంచుకుంటూపోతోంది సాయి పల్లవి. దానికి కారణం సాయి పల్లవి అద్భుతమైన నటి.. డ్యాన్సర్ కావడం అమెకు సానుకూలాంశాలు. తాజాగా ఆమె నటించిన వెబ్ ఫిల్మ్ ‘పావ కథైగల్’ విడుదలైంది. ప్రకాశ్ రాజ్ కూతురుగా ఇందులో నటించింది సాయి పల్లవి. గర్భవతి పాత్రలో కనిపించింది. దాంతో మరోసారి సాయి పల్లవి హాట్ టాపిక్ అయ్యింది.
అందరికీ ఆమె పేరే గుర్తుకు వస్తోంది!.. రెగ్యులర్ కమర్షియల్ పాత్రలు కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తోంది సాయిపల్లవి. నటనకు ఆస్కారం ఉన్న పాత్రైతే ముందుగా అందరికీ సాయిపల్లవి పేరే గుర్తుకు వస్తోంది. దీంతో ప్రస్తుతం టాలీవుడ్లో వరుస అవకాశాలతో సాయిపల్లవి దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల `లవ్ స్టోరీ` సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే రానా `విరాటపర్వం`కూడా పూర్తిచేసింది. నానితో `శ్యామ్ సింగరాయ్` చేయబోతోంది. అలాగే తాజాగా ప్రారంభమైన పవన్ కల్యాణ్-రానా సినిమాలో కూడా సాయిపల్లవి కీలక పాత్రకు ఎంపికైనట్టు తెలుస్తోంది. ఇక, గోపీచంద్ హీరోగా రాబోతున్న `అలిమేలుమంగ వేంకటరమణ` అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా సాయిపల్లవినే తీసుకున్నారట. ఒక్కో సినిమాకు కోటిన్నర వరకు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. అలాగని పారితోషికం కోసం పట్టింపు ఉన్న హీరోయిన్ కాదు. పట్టు విడుపులున్నాయి.మంచి మనసుంది. అప్పట్లో ఓ సినిమా కోసం కోటి పాతిక లక్షలు అడిగిన ఆమె ఆ సినిమా ఫ్లాప్ కావడంతో 40 లక్షలు తిరిగి నిర్మాతలకు ఇచ్చేసింది.