స్క్రిప్ట్ చదివేటప్పుడు ‘సినిమా ఇలా ఉంటుంది, నా పాత్ర అలా చేయొచ్చు’ అని ఒక ఐడియా వస్తుంది. చిన్నప్పుడు మనం చరిత్ర చదువుతున్నప్పుడు ‘ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది’ అని ఊహించుకుని ఉంటాం. శ్యామ్ సింగరాయ్‌లో స్క్రిప్ట్ చదివేటప్పుడు దేవదాసి క్యారెక్టర్ ఎలా చేయాలి? అనేదాని కంటే.. వాళ్ల సైకాలజీ ఎలా ఉంటుంది అని చెప్పడం నచ్చింది. వేరే సినిమాలతో పోలిస్తే ఈ సినిమాను సైకాలజీ పరంగా చేశాను.. అని చెప్పింది సాయి పల్లవి. నాని హీరోగా ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లు. ఈ మూవీ 24న విడుదల కాబోతున్న సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి తన పాత్ర గురించి చెప్పిన విశేషాలు…
“నేను డాన్స్ ఎక్కువ చేసింది ‘లవ్ స్టోరీ’లోనే అనుకుంటా. ‘శ్యామ్ సింగ రాయ్’లో డాన్స్ ఎంత కావాలో… అంతే పెట్టారు. నాకు క్లాసికల్ డాన్స్ రాదు. ఇప్పటి వరకు నేర్చుకోలేదు. నేను చేయగలుగుతానని రాహుల్ నమ్మారు. నాతో పాటు పాటలో క్లాసికల్ డాన్స్ చేసిన వారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు. ఆ పాటకు డాన్స్ చేసేటప్పుడు చాలా భయపడ్డాను. వాళ్లతో ఒకేలా చేశానని అంటే అదే పెద్ద సక్సెస్ అనుకున్నాను.
సినిమాలో దేవదాసి పాత్రే కనపడుతుంది !
దేవదాసి వ్యవస్థ గురించి పాఠశాలలో చదివా. దేవదాసీలు ప్రారంభంలో దేవుడికి సేవకులుగా ఉన్నాయి. తర్వాత తర్వాత దాన్ని మార్చేశారు. వాళ్ల గురించి పూర్తిగా చూపించలేదు. మా సినిమాకు ఎంత కావాలో అంతే తీసుకున్నాం. అన్ని మూవీస్‌లో క్యారెక్టర్‌కు కనెక్ట్ అయితేనే స్క్రీన్ మీద యాక్టింగ్ బావుంటుంది అనిపిస్తుంది. లేదంటే డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ సినిమాలో సాయి పల్లవి కనిపించదు..దేవదాసి పాత్రే కనపడుతుంది. రాహుల్ చాలా క్లారిటీతో సినిమా తీశారు. ఈ కథకి ఏం కావాలి! ఏం వద్దు! అనేది ఆయనకు పూర్తిగా తెలుసు.
కృతజ్ఞతతో కన్నీళ్లు వచ్చాయి… ప్రీ రిలీజ్ వేడుకలో ఆ పాట అనురాగ్ కులకర్ణి పాడారు. డాన్స్ చేశారు. మనం ఒక కళను ఎంజాయ్ చేయడమే పెద్ద విషయం. మనకు ఏమీ రాకున్నా ఎంజాయ్ చేయగలుగుతాం. అదే దేవుడు ఇచ్చిన పెద్ద ఆశీర్వాదం. అవన్నీ చూసి ఎమోషనల్ అయ్యాను. నా బ్రెయిన్ లో నేను మామూలు సాయి పల్లవినే. అయితే…నేను చేసే సినిమా చాలామందికి సంతోషం ఇస్తుందంటే ఎమోషనల్ అయ్యాను. నేను చాలా రుణపడ్డాను. నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలకు,ప్రేక్షకులకు అందరికీ థాంక్స్ చెప్పాలని అనుకున్నాను.
నాకు ఎందులో ప్యాషన్ ఉంది అంటే… చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అయితేనే సాయి పల్లవి ఓకే చేస్తుందా? అని అంటే.. అలా ఏం లేదండి! ప్రతి మూవీ నాకు నమ్మకం కలిగాకే చేస్తాను. అవన్ని నేను నమ్మి చేశాను. మీకు కూడా నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు నా గురించి తెలుసుకోవాలని ఉంటుంది. యాక్టింగ్, డాన్స్, మెడిసిన్ కాకుండా మెడిటేషన్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే… నా గురించి, పరిస్థితుల గురించి లోతుగా ఆలోచించాలని అనుకుంటున్నాను. నా గురించి నేను మరింత తెలుసుకోవాలి అనుకుంటున్నా. నేను చేస్తున్న ‘విరాట పర్వం` షూటింగ్ పూర్తయ్యింది.. నా పాత్ర డబ్బింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం ఓ వెబ్ ప్రాజెక్ట్ కంటెంట్ చదువుతున్నా. నచ్చితే తప్పకుండా చేస్తా. తమిళంలో చేసిన ఓ సినిమా కూడా త్వరలో విడుదల అవుతుంది.