‘సుప్రీమ్’ హీరో సాయిధరమ్‌తేజ్ హీరోగా క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై సెన్సిబుల్ డైరెక్టర్ ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తొలిప్రేమ, బాలు, డార్లింగ్ వంటి బ్యూటీఫుల్ లవ్స్టోరీస్ని తెరకెక్కించిన సెన్సిబుల్ డైరెక్టర్ ఎ.కరుణాకరన్.. సాయిధరమ్‌తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ శంషాబాద్‌లోని ఐ.ఎం.టి. కాలేజీలో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు మాట్లాడుతూ ”మా క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్లో ఇది 45వ సినిమా. ఈరోజు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. కంటిన్యూగా ఈ షెడ్యూల్ జరుగుతుంది. లవ్‌స్టోరీస్ స్పెషలిస్ట్ కరుణాకరన్‌గారితో మా బేనర్లో రెండో సినిమా చేస్తున్నాం. మళ్లీ మళ్ళీ ఇది రాని రోజు తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్‌కి మా బేనర్లో ఇది రెండో సినిమా. ఇంత మంచి టీమ్‌తో చేస్తున్న ఈ సినిమా మా బేనర్లో మరో సూపర్‌హిట్ మూవీ అవుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.
దర్శకుడు ఎ.కరుణాకరన్ మాట్లాడుతూ – ”ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సెంటిమెంట్స్, ఎమోషన్స్ కలిసిన యూత్‌ఫుల్ కలర్‌ఫుల్ లవ్‌స్టోరీ ఇది” అన్నారు.
సాయిధరమ్‌తేజ్, అనుపమ పరమేశ్వరన్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, పృథ్వీ, కాశీవిశ్వనాథ్, సురేఖావాణి, వైవా హర్ష, జోష్ రవి, ఐశ్వర్య, రాజా, భరత్‌రెడ్డి, కార్తీక్, అభిషేక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, సినిమాటోగ్రఫీ: ఐ. ఆండ్రూ, ఆర్ట్: సాయిసురేష్, ఫైట్స్: వెంకట్, పాటలు: సాహితి, రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, పోతుల రవికిరణ్, మాటలు: ‘డార్లింగ్’ స్వామి, స్టిల్స్: వెంకట్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సతీష్ కొప్పినీడి, ప్రొడక్షన్ కంట్రోలర్: వి.మోహన్, కో-ప్రొడ్యూసర్: కె.ఎ.వల్లభ, నిర్మాత: కె.ఎస్.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్.