`నీతో ఏదో చెప్పాల‌ని ఉంది` పాటతో ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్‌

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్‌…తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య అక్క‌ర్లేని పేరు. చిత్రం, జ‌యం, నువ్వు-నేను, `సంతోషం`, `మ‌న‌సంతా`,  `నువ్వు లేక నేను లేను` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు సంగీతం అందించిన ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్‌. ద‌ర్శ‌క నిర్మాత‌గా మారిన త‌ర్వాత త‌న సంగీతంతో మ్యూజిక్ ప్రేమికుల‌ను అల‌రించడం త‌గ్గిపోయింది.
అయితే సంగీత ప్రేమికుల కోసం ఆర్‌.పి ఇప్పుడు `నీతో ఏదో చెప్పాల‌ని ఉంది` అనే మెలోడీ సాంగ్‌ను సిద్ధం చేశారు. ఈ సాంగ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుద‌ల‌వుతుంది. సంగీతం అందించ‌డ‌మే కాకుండా ట్యూన్‌కు త‌గ్గ సాహిత్యం కూడా ఆర్‌.పియే అందించ‌డం విశేషం. ఈ సాంగ్‌ను ఆస్ట్రేలియాలో చిత్రీక‌రించారు. `బాహుబ‌లి` సినిమాలో `మ‌మ‌త‌ల త‌ల్లి..` పాటను పాడిన స‌త్య యామిని పాడగా, సత్య యామిని, అనుదీప్‌ కలిసి నటించారు. జ‌న‌వ‌రి 5న ఈ పాట‌ను విడుద‌ల చేస్తున్నారు.
 
ఈ సాంగ్ సంగీతం ప్ర‌ప‌చంలో ఓ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంద‌ని ఆదిత్య మ్యూజిక్ కాన్ఫిడెంట్‌గా ఉంది. అలాగే మంచి కాన్సెప్ట్స్‌తో కూడిన ఓరిజిన‌ల్ సాంగ్స్‌ను, మ్యూజిక్ ఆర్టిస్టుల‌ను ఎంక‌రేజ్ చేయ‌డానికి ఆదిత్య‌మ్యూజిక్ ఎప్పుడూ ముందుంటుంది.