మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ’22’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. పూరి జగన్నాథ్, వి.వి.వినాయక్, మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలోఈ చిత్రం రూపొందింది . ఇటీవల పూరి జగన్నాథ్ చేతులమీదుగా విడుదలైన హీరో ఫస్ట్‌లుక్ గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం టీజర్ ను 2ఫిబ్రవరి2020న ఉదయం 8:59 నిమిషాలకు నాగార్జున విడుదల చేశారు. ఈ కార్యక్రమంలోఅక్కినేని నాగచైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మారుతి ముఖ్య అతిథిగా పాల్గొని `22` మూవీ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత కొండా కృష్ణం రాజు పాల్గొన్నారు.
నాగార్జున మాట్లాడుతూ – “అందరికి ఎంతో ఇష్టమైన బి.ఎ.రాజు గారి, జయగారి అబ్బాయి శివ. జయగారు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి చాలా ఇష్టం. వాళ్ళిద్దరితో నేను బాగా క్లోజ్ గా ఉంటాను. జయగారు ఇప్పుడు మన మధ్య లేరు కానీ వాళ్ళ అబ్బాయి డైరెక్టర్ అవుతున్నాడు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శివ దర్శకుడిగా జయగారి పేరు నిలబెట్టాలి. అలాగే బి.ఎ.రాజు గారిది కూడా. రూపేష్ వెల్ కమ్ టు ఫిలిం ఇండస్ట్రీ. బయట ఎన్నో సక్సెస్ ఫుల్ బిజినెస్ లు ఉన్నా సినిమా అంటే ఫ్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చాడు. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. ఇప్పుడే టీజర్ చూశాను. ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టైటిల్ 22. టీజర్ విడుదలయింది 2-2-2020. అన్ని రెండులే ఉన్నాయి. న్యూమరాలజి ప్రకారం నాది కూడా రెండు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.
మారుతి మాట్లాడుతూ – శివ దర్శకుడు కావడం చాలా సంతోషంగా ఉంది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా వద్దకు వచ్చి ఓ సినిమా ప్రొస్ట్ ప్రొడక్షన్ అంతా హ్యాండిల్ చేశాడు. రాజుగారు ఎలా ఒక సినిమా సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకొని కష్టపడి ప్రమోషన్ చేస్తారో… అలా శివ కూడా చాలా కష్టపడతాడు. కొత్తగా దర్శకులు కావాలనుకునేవారు తొలుత ప్రేమకథను తీయాలనుకుంటారు. కానీ శివ విభిన్నంగా ఆలోచించి ఓ క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌ను తీసుకుని ఇంత బాగా తీశాడంటే అతని మెచ్యూరిటీ లెవల్ ఏంటో తెలుస్తోంది. ఈ కథను నమ్మి, రూపేష్ హీరోగా నటించాడు. రూపేష్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడనిపిస్తోంది. సలోనితో పాటు టీమ్ అందరు బాగా చేశారు. వి.వి.వినాయక్‌గారు, నేను ఈ సినిమా లాంచ్ చేశాం. అప్పుడే ఈ సినిమా టీజర్ లాంచ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి దర్శకుడు ఇండస్ట్రీకి చాలా అవసరం. శివ దర్శకుడిగా తప్పక సక్సెస్ అవుతాడు. కో-డైరెక్టర్ పుల్లారావుగారు ఉంటే ఆ ప్రొడక్ట్ బాగా వస్తుంది. ఇలాంటి సీనియర్ దర్శకులతో పని చేసే అవకాశం శివకు వచ్చింది.టీమ్ అందరికీ ఆల్‌దిబెస్ట్“ అన్నారు.
కొండా కృష్ణంరాజు మాట్లాడుతూ – “నాగార్జునగారు, పూరీ జగన్నాథ్‌గారు, మారుతిలాంటి ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈ సినిమాకు ముందుకొచ్చి శివమీద వారికి ఉన్నప్రేమను, నమ్మకాన్ని తెలియజేస్తుంటే శివ చాలా అదృష్టవంతుడనిపిస్తోంది. ఇంతమంది పెద్దల అశీస్సులతో శివకు, రూపేష్ గారికి ఈ సినిమా పెద్ద బ్రేక్ అవ్వాలని, ఎంటైర్ యూనిట్‌కి ఈ ఇదొక పెద్ద సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.
హీరో రూపేష్‌కుమార్ చౌదరి మాట్లాడుతూ – ` మా అయి ఈ ప్రొడక్షన్ బ్యానర్ లొగొ లాంచ్ కార్యక్రమానికి మారుతిగారు వచ్చి వారి ఆశీస్సులు అందించారు. మళ్లీ ఈ సినిమా క్యాలెండర్ లాంచ్ చేసినందుకు మారుతిగారికి థ్యాంక్స్. నాగార్జునగారిచేతుల మీదుగా మా సినిమా టీజర్ లాంచ్ అవడం నెక్ట్స్ లెవల్ ఆనందంగా ఉంది“ అన్నారు.
చిత్ర దర్శకుడు శివకుమార్ బి.మాట్లాడుతూ – “నాగార్జున టీజర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. కొత్త దర్శకులను ప్రొత్సహించే నాగార్జునగారి చేతుల మీదుగా మా టీజర్ లాంచ్ కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎంటైర్ 22టీమ్ తరఫున నాగార్జునగారికి థ్యాంక్స్. మారుతిగారు ఇటీవల ప్రతిరోజూపండగే సినిమాతో పెద్ద సక్సెస్ అందుకున్నారు.కథ ప్రకారమే 22 అనే టైటిల్ పెట్టాం. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్“ అన్నారు.
రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా, విక్రమ్ జీత్ విర్క్, దేవిప్రసాద్, జయప్రకాష్, రవి వర్మ, శశిధర్ కోసూరి, ఫిదా శరణ్య, రాజశ్రీనాయర్, పూజా రామచంద్రన్, కృష్ణ చైతన్య, ఆఫ్ఘనిస్తాన్ రామరాజు, బేబి సంస్కృతి, మాస్టర్ తరుణ్, మాస్టర్ దేవాన్ష్, బేబి ఓజల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ : బి.వి. రవికిరణ్, సంగీతం: సాయికార్తీక్, ఎడిటింగ్: శ్యామ్ వాడవల్లి, కొరియోగ్రఫీ: అనీలామా, ఆర్ట్: పెద్దిరాజు అడ్డాల, స్టంట్స్: జాషువ, నిర్మాత: శ్రీమతి సుశీలాదేవి