యష్ పాన్ ఇండియా చిత్రం ‘కె.జి.య‌ఫ్ 2’ ద‌స‌రాకు..

ట్రెండ్ సెట్టింగ్‌ మూవీస్‌ అరుదుగా వస్తుంటాయి. అరుదైన ట్రెండ్‌ సెట్టింగ్‌ మూవీస్‌లో ‘కె.జి.యఫ్‌’ ఒకటి. ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 1’ పాన్ ఇండియా చిత్రంగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సెన్సేషనల్ హిట్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్‌ను సాధించింది. ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 1’ విజువల్‌ ఎఫెక్ట్‌, స్టంట్స్‌ విభాగం లో జాతీయ అవార్డులు సాధించింది.
 
‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 1’కి కొనసాగింపుగా ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2‘ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.ద‌స‌రా సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 23న ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’ విడుద‌ల‌వుతోంది .
 
‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’ ఫస్ట్‌ లుక్‌‌కి ప్రేక్షకులు, అభిమానుల నుండి అమేజింగ్‌ రెస్పాన్స్ వచ్చింది. సంజయ్‌ దత్‌ ఈ చిత్రంలో అధీర అనే పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ నటి రవీనాటాండన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవ‌ల య‌ష్‌, సంజ‌య్ ద‌త్‌, ర‌వీనాటాండ‌న్ స‌హా ఇత‌ర తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. దీంతో మేజ‌ర్ షెడ్యూల్ పూర్త‌య్యింది. రాకీ భాయ్‌గా యష్ రాకింగ్‌ పెర్ఫామెన్స్ చేయనున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి..భువన్‌ గౌడ సినిమాటోగ్రఫీ ..రవి బస్రూర్‌ సంగీతం