సీనియర్ నటుడు రహమాన్ నటించిన చిత్రం `ఒరు ముగ తిరై`. సెంథిల్ నాథన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని యశ్వంత్ మూవీస్ బ్యానర్‌పై డి.వెంకటేష్ తెలుగులో `డాక్టర్ సత్యమూర్తి` పేరుతో విడుదల చేస్తున్నారు. సినిమా జూన్ 1న విడుదలవుతుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో పాటల బిగ్ సీడీని మీడియా మిత్రుల చేతుల మీదుగా విడుదల చేశారు. సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు మాట్లాడుతూ “ఈ చిత్రం చాలా మంచి చిత్రం కథ చాలా బావుంటుంది. ఈ చిత్రం ద్వారా ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి అందరికి మంచి పేరు రావాలి“ అని అన్నారు.
నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ “సోషల్‌మీడియా ఆధారంగా వాట్స్ అప్, ఫేస్బుక్ ఐడిల్స్ని వేరే ఫొటోలు పెట్టి చాటింగ్‌లు చేసి, చీట్ చెయ్యడం వంటివి మనం ఎక్కువగా చూస్తున్నాం. దీన్ని ఆధారంగా తీసుకుని కథ నడుస్తుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లింగ్ చిత్రం. ఈ చిత్రం మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. చిత్రం మొత్తం ప్రస్తుతం ట్రెండ్ మీద ఆధారపడి ఉంటుంది“ అన్నారు
హీరో మాట్లాడుతూ “ డాక్టర్ సత్యమూర్తి చిత్రం సోషల్ మీడియా ద్వారా చాటింగ్, మెంటల్ హెరాస్మెంట్, అన్‌మెచ్యూర్డ్ మైండ్స్ ఏ విధంగా మోసపోతున్నారు. అమ్మాయిలను ఏ విధంగా మోసం చేస్తున్నారు అనే నేపథ్యంలో కథ ఉంటుంది“ అన్నారు.
సాంకేతిక నిపుణులుః కెమెరామెన్: శరవణ పాండియన్, మ్యూజిక్: ప్రేమ్ కుమార్, ఎడిటింగ్: ఎస్.పి.అహ్మద్, ఆర్ట్: వినోద్ రవీంద్రన్, స్టంట్స్: బిల్లా, జగన్, పాటలు: డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి.