‘మాస్ మహారాజా’ రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `రాజా ది గ్రేట్`. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై శిరీష్ నిర్మాతగా ఈ చిత్రం నిర్మితమవుతుంది. ఈ సినిమాలో రవితేజ తనయుడు మహాధన్ తెరంగేట్రం చేయనుండటం విశేషం. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమాను అక్టోబర్ రెండో వారంలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తన్నారు. ఈ సందర్భంగా…
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “పటాస్, సుప్రీమ్ చిత్రాల తర్వాత నా దర్శకత్వంలో వస్తోన్న మరో కమర్షియల్ ఎంటర్టైనర్ రాజా ది గ్రేట్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న సినిమాలో మాస్ మహారాజా రవితేజగారు ఇప్పటి వరకు చూడని అంధుడి పాత్రలో కనపడనున్నారు. అల్రెడి విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ఆడియెన్స్ నుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. అసలు విషయమేమంటే, ఈ చిత్రంలో రవితేజగారి తనయుడు మహాధన్ నటిస్తున్నాడు. కథలో భాగంగా రవితేజగారి చిన్నప్పటి పాత్రలో ఎవరు నటిస్తే బావుంటుందనే దానిపై చాలా ఆలోచించాం. చివరకు ఆ పాత్రకు మహాధన్ అయితే సరిపోతాడనిపించి రవితేజగారిని అడిగాం. ఆయన కూడా సరేనన్నారు. సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. అక్టోబర్ రెండో వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.
రవితేజ, మెహరీన్, ప్రకాష్ రాజ్, రాధికా శరత్‌కుమార్, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచనా సహకారం: S.కృష్ణ, సంగీతంః సాయికార్తీక్, సినిమాటోగ్రఫీః మోహనకృష్ణ, ఎడిటింగ్ః తమ్మిరాజు, ఆర్ట్ః ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్స్ః వెంకట్, సహ నిర్మాతః హర్షిత్ రెడ్డి, నిర్మాతః శిరీష్, కధ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్ వం: అనిల్ రావిపూడి.