రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న ‘క్రాక్’ లో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. రవితేజ పాత్రలోని పవర్‌ను చూపేలా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాకు పేరుపెట్టారు. రవితేజ గడ్డం, మెలితిప్పిన మీసాలతో ..డిఫరెంట్ లుక్‌లో కనపడుతున్నారు.ఈ రవితేజ 66వ చిత్రం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి బి.మధు దీనికి నిర్మాత. రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, దిల్‌రాజు, డి.సురేష్‌బాబు, ఎన్.వి.ప్రసాద్, సురేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నవీన్ ఎర్నేని, పరుచూరి బ్రదర్స్, దాము, బీవీఎస్ఎన్ ప్రసాద్, రామ్ తాళ్లూరి వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
గోపీచంద్ మలినేని మాట్లాడుతూ – తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథతో ఈ సినిమా ఉంటుంది.త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి .. వచ్చే వేసవి లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.
శృతిహాసన్ హీరోయిన్గా ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్రఖని, దేవీ ప్రసాద్, పూజిత పొన్నాడ, చిరాగ్ జాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.`మెర్సల్`,`బిగిల్` చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన జి.కె.విష్ణు ఈ చిత్రానికి కెమెరామెన్.
పాటలు: రామజోగయ్యశాస్త్రి, డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాశ్
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, కో ప్రొడ్యూసర్: అమ్మిరాజు కానుమిల్లి