రష్మిక మందన్న చిత్ర పరిశ్రమలోకి వచ్చిన అనతి కాలంలోనే దక్షిణాది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. తన క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో రెండుసార్లు మోస్ట్ డిసైరబుల్ ఉమెన్‌గా నిలిచింది ఈ నేషనల్ క్రష్. ‘ఛలో’తో హిట్ కొట్టి.. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ‘గీతగోవిందం’తో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది. తెలుగులో టాప్ హీరోయిన్గా కొనసాగుతూనే, బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ఒకేసారి ‘గుడ్ బై’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాల్లో నటిస్తూనే.. మరో సినిమాకు కూడా సైన్ చేసింది. బాలీవుడ్లో కూడా రష్మిక జెట్ స్పీడ్‌లో దూసుకుపోయేలా కనిపిస్తోంది. కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని ఇటీవలె రష్మిక ముంబైలో ఓ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. రీసెంట్గా కొత్త ఇంట్లోకి రష్మిక షిఫ్ట్ అయ్యింది.
రష్మిక ఈ విషయాన్ని ఇన్‌స్టా ద్వారా తెలియజేస్తూ.. “ఎట్టకేలకు కొత్త అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయ్యాను. దీనికోసం చాలానే షాపింగ్ చేయాల్సి వచ్చింది. అయితే నేను కొనాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. నా అసిస్టెంట్ సాయి నాకు ఇల్లు షిఫ్ట్ అవ్వడంలో సహాయం చేశాడు. ఆరా(పప్పీ), నేను చాలా అలసటతో ఉన్నా.. దానిని అధిగమించాం” అంటూ ఇన్‌స్టా లో రాసుకొచ్చింది. ఈ విల్లా ధర చాలా కాస్ట్లీ అని సమాచారం. ఇక రష్మిక ప్రస్తుతం తెలుగులో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
షాకింగ్ నిర్ణయం తీసుకుంది!… రష్మిక మందన్న తరచూ తనకు సంబంధించి విషయాలను, ఫొటోలను పెడుతూ.. సామాజిక అంశాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే రష్మికకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రష్మిక కొత్త పోస్టుల కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలా అంత క్రేజ్ సంపాదించుకున్నా.. ఆమె అప్పట్లో ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుందట. కరోనా సెకండ్ వేవ్‌కు ముందు.. పూర్తిగా సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్వూలో వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ త్వరలో రానుందని తన టీం చెప్పడంతో.. అప్పుడే తన సోషల్ మీడియా ఖాతాలను డిలిట్ చేయాలనుకున్నట్లు రష్మిక తెలిపింది.
“కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని అర్థమైంది. అది ఎంతో బాధను కలిగిస్తూ, మానసిక శాంతిని దూరం చేస్తుంది. అందుకే మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియాను విడిచిపెట్టాలని అనుకున్నా. కానీ అలా చేయలేకపోయాను. ఈ సంక్షోభ సమయంలో సామాన్య ప్రజలకు సహాయం చేస్తున్న వారిలో స్ఫూర్తి నింపాలని కోరుకున్నా. అందుకే ‘spreading hope’ను ప్రారంభించాను” అంటూ రష్మిక వివరించింది.