నటన పేరుతో హావభావాలు కొని తెచ్చుకోను !

‘‘తొలి సినిమా చేసే వరకు కూడా నాకు నటనలో ఎలాంటి ప్రవేశం లేదు. పాఠశాల లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో డ్యాన్సులు చేసేదాన్ని. కానీ, నటనవైపు వెళ్లేదాన్ని కాదు. ధైర్యం చేసి ఒకసారి ప్రయత్నించినా నటించలేకపోయా. అప్పట్నుంచి నటన జోలికి వెళ్లలేదు. కానీ అప్పట్లో నటన తెలియకపోవడమే నాకు మేలైందేమో. తొలి సినిమా కోసం కెమెరా ముందుకొచ్చాక నాలా నేను కనిపించాలనుకొన్నా. నటన పేరుతో ప్రత్యేకంగా హావభావాలు కొని తెచ్చుకోకుండా సన్నివేశంలో ఉన్న ఇలాంటి సందర్భం నాకే ఎదురైతే ఎలా స్పందిస్తానో … ఆ విధంగా నటించా. అదే నాలో ఒరిజినాలిటీని బయటికి తీసుకొచ్చింది. నా పాత్రల్లో సహజత్వం వెనక అసలు రహస్యం అదే’’ అని చెప్పింది రష్మిక.
 
అత్యధిక పారితోషికం
టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌ స్ధాయికి చేరుకుంటున్న రష్మిక మందానా తన పారితోషికాన్ని అమాంతం పెంచేశారు. ‘డియర్‌ కామ్రేడ్‌’లో ఆమె రూ 80 లక్షలు పారితోషికంగా అందుకుంటున్నట్టు సమాచారం. ఆమె చేతిలో మరో రెండు భారీ సినిమాలు కూడా ఉండటంతో త్వరలోనే రెమ్యూనరేషన్‌ను మరింత డిమాండ్‌ చేసే అవకాశం ఉంది. త్వరలో అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్ల సరసన చేరనుంది.
 
‘ఛలో’ మూవీతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రష్మికకు ‘గీత గోవిందం’తో బ్లాక్‌బస్టర్‌ లభించింది. ప్రస్తుతం ఆమె విజయ్‌ దేవరకొండతో కలిసి నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ విడుదల కోసం వేచిచూస్తున్నారు. హిట్‌ జోడీగా వారికి పేరుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరోవైపు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సరసన సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీలో కూడా రష్మిక అభిమానులకు కనువిందు చేయనున్నారు.ఆమె త్వరలోనే మహేష్‌బాబుతో కలిసి ఆడిపాడబోతోంది.ఈ విషయాన్ని స్వయంగా రష్మికానే తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు తెలిసింది. కాగా ఈనెల 31న ఈ చిత్రం ప్రారంభం కానుంది. అలాగే త్వరలోనే సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది. ఇటీవలే ‘ఎఫ్ 2’తో భారీ హిట్‌ను కొట్టాడు అనిల్. ఇక ఈ సినిమాలో ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే రమ్యకృష్ణ కూడా ఓ ముఖ్య పాత్రలో నటించనుందని సమాచారం.