“అవకాశాలు అధికం అవ్వడంతో రక్షిత్ శెట్టితో పెళ్లికి సమయాన్ని కేటాయించడం తనకు సాధ్యం కాలేదని,పెళ్లి చేసుకుంటే నిర్మాతలను ఇబ్బందులకు గురి చేసినట్లవుతుందని …వారికి ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టకూడదనే తాను పెళ్లి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు” చెప్పింది రష్మిక మందనా. టాలీవుడ్లో ‘గీతగోవిందం’ ఘన విజయంతో అనూహ్యంగా రష్మిక క్రేజీ స్టార్ హీరోయిన్ అయ్యింది. ‘డియర్ కామ్రేడ్’ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా.. రష్మిక ఇమేజ్ మాత్రం తగ్గలేదు. తెలుగులో స్టార్ హీరోలతో జతకట్టేస్తోంది. రష్మిక కన్నడ నటుడు, నిర్మాత రక్షిత్ శెట్టితో లవ్‌లో పడి, .. పెళ్లి వరకూ వెళ్లి..తర్వాత దాన్ని రద్దు చేసుకుంది. ఆ విషయాన్ని ఇటీవల తనే ఒక ఇంటర్వ్యూలో వివరించింది..
“అవును నేను ప్రేమలో పడ్డాను. రక్షిత్ శెట్టితో నాకు నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, పెళ్లిని ఎందుకు రద్దు చేసుకున్నానంటే.. నాకు కాబోయే భర్త సినిమా రంగానికి చెందిన వాడు కాకూడదని భావించా”నంది.
రక్షిత్ శెట్టి పరిచయం అవగానే చాలా భిన్నంగా అనిపించాడని ..అతనిపై ప్రేమ పుట్టినందువల్ల పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. అయితే, సినిమారంగంలో ఇద్దరం పేరు తెచ్చుకోవాలని,పెళ్లిని రెండేళ్లు వాయిదా వేసుకున్నామని..అయితే, రెండేళ్లు గడిచిన తరువాత అవకాశాలు అధికం అవ్వడంతో పెళ్లికి సమయాన్ని కేటాయించడం తనకు సాధ్యం కాలేదని చెప్పింది. పెళ్లి చేసుకుంటే నిర్మాతలను ఇబ్బందులకు గురి చేసినట్లవుతుందని..వారికి ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టరాదనే తాను పెళ్లి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు చెప్పింది.
రక్షిత్‌తో పెళ్లికి గుడ్‌భై చెప్పిన రష్మిక నటిగా చాలా బిజీగా ఉంది. అయితే కాస్త విరామాన్ని కల్పించుకుని ‘హ్యాపీ న్యూఇయర్’ను రోమ్ నగరంలో ఎంజాయ్ చేయడానికి వెళ్తోంది.. మళ్లీ జనవరి 5న తిరిగి వచ్చి షూటింగ్స్‌లో పాల్గొంటుందట.
రష్మిక చాలా పెద్ద కలలు కంది!
రష్మికా మందన్నాతో బ్రేకప్ గురించి కన్నడ నటుడు రక్షిత్ శెట్టి తన తాజా చిత్రం ‘అతడే శ్రీమన్నారాయణ’ ప్రమోషన్లో జాతీయ మీడియాతో స్పందించాడు. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.మొదట “కొన్ని విషయాలను మరచిపోవడమే మంచిది” అని అన్నాడు.”రష్మిక చాలా పెద్ద కలలు కంది . ఆమె గతం నాకు తెలుసు కాబట్టి.. ఆ కలలు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలుసు. ఆమె కలలు నిజం కావాలని దేవున్ని కోరుకుంటున్నాను” అని తెలిపాడు.
రష్మిక, రక్షిత్‌ల నిశ్చితార్థం జరిగి ఏడాదికే విడిపోయారు. ఆ సమయంలో రక్షిత్ అభిమానులు రష్మిక పై కామెంట్లు చేయడంతో రక్షిత్ స్పందించాడు.. “రష్మికా గురించి మీరు ఓ అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నారు. ఎవర్ని నేను తప్పుపట్టను. మనం ఏం చూస్తున్నామో.. అదే నమ్ముతుంటాం. కానీ అది నిజం కాకపోవచ్చు. చాలా సార్లు మనం మరో వైపు కోణాన్ని చూడకుండానే..నిర్ధారణకు వచ్చేస్తుంటాం. నాకు రష్మిక రెండున్నరేళ్లకు పైగా తెలుసు. దయచేసి ఆమెను జడ్జి చేయడం ఆపండి” అని అభిమానులను కోరారు.
‘ఫ్రెండ్, ప్రేమ,పెళ్లి’ ఆటకు స్పందన
‘డియర్ కామ్రేడ్’ చిత్రంలోని రష్మిక నటనకు గానూ బిహైండ్ వుడ్స్ వారు అవార్డు ప్రకటించారు. ‘ఉత్తమ నటి (విమర్శకులు ఛాయిస్) గోల్డ్ మెడల్ అవార్డు ని అందుకునేందుకు రష్మిక చెన్నైలో బిహైండ్ వుడ్స్ ఫంక్షన్ కు హాజరయ్యింది.ఈ ఫంక్షన్ లో రష్మిక చాలా అందంగా కనిపించి అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. ప్రశ్నలకు తెలివిగా సమాధానం ఇచ్చింది. ప్రఖ్యాత ‘ఫ్రెండ్, ప్రేమ,పెళ్లి’ ఆటకు స్పందించిన రష్మిక .. “స్నేహం? విజయ్ దేవరకొండ, ప్రేమ? విజయ్ సేతుపతి, వివాహం? విజయ్ తలపతి!” అని చెప్పింది.రష్మిక కేవలం విజయ్ పేరు గల ముగ్గురి హీరోల పేర్లు చెప్పడం చర్చనీయాంశం అయింది.