“కొన్ని సార్లు మన వల్లనో.. లేదంటే ఇతరుల వలనో అభద్రతా భావానికి గురవుతుంటాం. అతిగా ఆలోచించి బుర్రకూడా పాడు చేసుకుంటూ ఉంటాం”…అంటూ రష్మిక మంధాన లాక్ డౌన్ సమయంలో కొంచం అభద్రతాభావానికి గురైనట్టు సోషల్ మీడియా ద్వారా వివరించింది..
“బరువు పెరిగానా, సన్నగా ఉన్నానా, జిడ్డు చర్మంలా ఉందా? రఫ్‌గా ఉందా? …అని మన ఫ్రెండ్స్‌ని.. అంటూ అడుగుతూ ఉంటాం. ‘మీ ఫేస్‌కి అలా అయ్యిందే?’ అని ఎవరన్నా అడిగితే.. తర్వాతి పది రోజులు దుప్పటి కప్పుకొని పడుకుంటామే తప్ప, బయటకి రాం. వీటన్నింటి గురించి ఆలోచిస్తే అభద్రతాభావానికి గురైనట్టు ఉంటుంది. నిజం చెప్పాలంటే.. లాక్‌డౌన్ సమయంలో నేనూ అభద్రతా భావానికి లోనయ్యాను. నా పని, శరీరాకృతి, మానసిక ఆరోగ్యం ఇలా ప్రతి విషయం గురించీ ఆందోళన చెందాను. అయితే ,ఇవన్నీ కరెక్ట్ కాదని భావించి మన ఉత్తమ భావాలను పెంపొందించుకోవచ్చు కదా! అని అనుకున్నాను”
“అభద్రతకి గురి చేసే విషయాలని బలాలుగా మార్చుకోవాలి. ఎవరైన లావుగా, నల్లగా, బక్కగా ఉన్నారని అన్నా కూడా మీరు మిమ్మల్ని నమ్మండి అనుకున్నది చేయండి. ఈ మేరకు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. నేను ఏం చెప్పదలచుకున్నది ఇదే !” .. అంటూ తన అభిమానుల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందించే విధంగా సందేశమిచ్చింది రష్మిక.
దీనిపై స్పందించిన కళ్యాణి ప్రియదర్శన్..” ఒక వ్యక్తి ప్రతికూల అభిప్రాయాన్ని ప్రజలు ఎక్కువగా ఆలోచించడం సులభం. ఆ సమయంలో మనపై మనకే చిరాకు వస్తుంది. నువ్వు పర్‌ఫెక్ట్. నన్ను నమ్ము. నీ ఫోటో చూస్తే అభద్రతాభావంలో ఉన్నావని అనిపిస్తుంది. అయినప్పటికీ ప్రజలు నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు” అని కామెంట్ చేసింది.
మంచి జర్నలిస్ట్ కావాలనే టార్గెట్ పెట్టుకొన్నా!
“తాను చదివింది జర్నలిజం కోర్సు అయితే.. చివరకు సినీ రంగంలో ఇలా సెటిల్ అయ్యాన”ని అంటోంది రష్మిక మందన. జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. యాక్టర్ కావాలనుకున్నవాళ్ళు డాక్టర్ అవుతారు, డాక్టర్ కావాలనుకున్న వాళ్ళు వ్యాపార రంగంలో స్థిరపడుతుంటారు. అయితే ఇలాంటివన్నీ ‘దేవుడు రాసిన రాత’ అని అంటుంటారు పెద్దలు. ఎవరెన్ని ఊహించుకున్నా, తన కేరీర్ అలా సాగాలి, ఇలా సాగాలి అని ఎంత ప్రయత్నించినా చివరకు ఏది రాసిపెట్టి ఉందో అదే అవుతారని అంటుంటారు. రష్మిక విషయంలోనూ అదే జరిగిందట.
తాను చదివింది జర్నలిజం కోర్సు అయితే.. చివరకు సినీ రంగంలో ఇలా సెటిల్ అయ్యానని అంటోంది రష్మిక మందన. ఇష్టమైన చదువు పూర్తిచేశాక, నటనను కెరీర్‌గా ఎంచుకున్నానని చెప్పిన ఆమె.. ఊహ తెలిసినప్పటి నుండీ నటనపై ఆసక్తి ఉందని తెలిపింది. మంచి జర్నలిస్ట్ కావాలనే టార్గెట్ పెట్టుకొని జర్నలిజం పూర్తిచేశాను. కానీ ఆ తర్వాత సినిమారంగం పట్ల మక్కువ పెరిగింది. మొదట మోడలింగ్ రంగంలోకి వెళ్లి… ఆ తర్వాత సినిమా అవకాశాలు సంపాయించానని పేర్కొంది రష్మిక.
తొలి కన్నడ చిత్రం ‘కిర్రాక్ పార్టీ’ ఘనవిజయం సాధించడంతో…ప్రతి చిత్రాన్ని చాలా జాగ్రతగా ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని రష్మిక చెప్పింది. తెలుగులో ‘ఛలో’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ భామ ‘గీతగోవిందం’, ‘భీష్మ’, ‘సరిలేరు నీకెవ్వరు’ రూపంలో భారీ విజయాలు ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ‘పుష్ప’ లో చేస్తోంది.