ఆ విధంగా సూపర్ ఛాన్స్ కొట్టేసింది !

సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం షూటింగ్ ఈ నెలాఖరున మొదలుకానుంది. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుంది. టాలీవుడ్ లోకి వచ్చిన కొద్దికాలానికే ఆమె మహేష్‌తో కలిసి నటించనుండడం విశేషం.నిజానికి ముందుగా రష్మిక ఈ ప్రాజెక్ట్‌లో లేదు. దర్శకుడు అనిల్ రావిపూడి అడిగినప్పుడు ఆమె డేట్స్ ఖాళీ లేవు. నితిన్ చిత్రం ‘భీష్మ’తో పాటు తమిళ్‌లో శివ కార్తికేయన్ సినిమాకు కాల్ షీట్స్ ఇవ్వడంతో ఆమె మహేష్ చిత్రానికి ఓకే చెప్పలేకపోయింది.
 
అయితే, ఆతర్వాత శివ కార్తికేయన్ సినిమాలో తనది కేవలం ‘గ్లామర్ పాత్ర’ అంటూ బయటికు వచ్చేసింది. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’లో అప్పటికి ఇంకా ఎవరినీ హీరోయిన్‌గా తీసుకోకపోవడంతో వెంటనే రష్మిక ఈ చిత్రానికి ఓకే చెప్పిందని తెలిసింది. ఆ విధంగా టాలీవుడ్‌కు పరిచయమైన రెండేళ్లకే సూపర్‌స్టార్ మహేష్ చిత్రంలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసింది.ఇక అనిల్ రావిపూడి సినిమాల్లో ఎలాగూ హీరోయిన్లకు మంచి స్కోప్ ఉంటుంది. ‘పటాస్’లో రాశిఖన్నా, ‘రాజా ది గ్రేట్’లో మెహరీన్, ‘ఎఫ్2’లో తమన్నా… ఇలా హీరోయిన్ల పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’లో సైతం అలాంటి అవకాశం ఉండటంతో.. ఆలస్యం చేయకుండా రష్మిక ఓకే చెప్పిందట.
 
లక్కీ హీరొయిన్ కి భారీ పారితోషికం
టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌ స్ధాయికి చేరుకుంటున్న రష్మిక మందానా తన పారితోషికాన్ని అమాంతం పెంచేశారు. ‘డియర్‌ కామ్రేడ్‌’లో ఆమె రూ 80 లక్షలు పారితోషికంగా అందుకుంటున్నట్టు సమాచారం. ఆమె చేతిలో మరో రెండు సినిమాలు కూడా ఉండటంతో త్వరలోనే రెమ్యూనరేషన్‌ను మరింత డిమాండ్‌ చేసే అవకాశం ఉంది. టాలీవుడ్‌లో రష్మిక మందానా త్వరలో అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్ల సరసన చేరనుంది.’ఛలో’ మూవీతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రష్మికకు ‘గీత గోవిందం’తో బ్లాక్‌బస్టర్‌ లభించింది. ప్రస్తుతం ఆమె విజయ్‌ దేవరకొండతో కలిసి నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ విడుదల కోసం వేచిచూస్తున్నారు. హిట్‌ జోడీగా వారికి పేరుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరోవైపు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సరసన సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీలో కూడా రష్మిక అభిమానులకు కనువిందు చేయనుంది.మహేష్ ,అనిల్ రావిపూడి సినిమాలో కూడా ఆమె గోల్డెన్ అవకాశం కొట్టేసింది. ఈలక్కీ హీరొయిన్ కి ఈ రెండు సినిమాల్లో కూడా భారీ పారితోషికం ముడుతోంది.